సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అలా ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలకు మొదటి సినిమా విడుదల కాక ముందే మరి కొన్ని సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి, అయితే అలా మొదటి సినిమా విడుదల కాక ముందే కొంత మంది ముద్దుగుమ్మ లకు అవకాశాలు దక్కుతు ఉంటాయి, అయితే మొదట ఒప్పుకున్న సినిమా కంటే ముందుగానే ఇతర సినిమాలు విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడం ఆ తర్వాత ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారడం ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి, ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇలాంటి సంఘటనే జరిగింది. కేరళ బ్యూటీ సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబిసార సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది, అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ ముద్దుగుమ్మకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాలో అవకాశం దక్కింది, ముందుగా షూటింగ్ మొదలు పెట్టిన బింబిసార కంటే ముందే భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యింది.
అయితే ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది, ఇలా సంయుక్త మీనన్ ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రస్తుతం ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ మూవీ లో కూడా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది, ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంయుక్త మీనన్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.