సంక్రాంతి
పండుగ బరి నుండి తప్పుకున్న ఆర్ ఆర్ ఆర్
సినిమా తాజాగా
మార్చి 25న విడుదలకు సిద్దం అయ్యింది. సమ్మర్ స్పెషల్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటి యూనిట్ సభ్యులు ప్రకటించారు. కాని పరిస్థితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆ తేదీన విడుదల అయితే కాస్త కష్టాలు తప్పక పోవచ్చు అనే అభిప్రాయం అనేది వ్యక్తం అవుతోంది.మాములుగా అయితే
మార్చి చివరి వారం సేఫ్ జోన్. తెలుగు రాష్ట్రాల్లో పది ఇంకా ఇంటర్ పరీక్షలు పూర్తి అవుతాయి. కాని ఈసారి
కరోనా మహమ్మారి వల్ల అకడమిక్ ఇయర్ మొత్తం గందరగోళంగా ఉంది. దాంతో
మార్చి చివర్లో కాకుండా ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇక దాంతో ఆర్ ఆర్ ఆర్
సినిమా పరీక్షల కు ముందు వస్తుంది. దాంతో విద్యార్థలు ఈ సినిమాను చూడటం కష్టమే అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.ఇక ఇదే సమయంలో విద్యార్థలు ఇంకా వారి తల్లిదండ్రులు కూడా సినిమాకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు.
పరీక్షలు ఈ
సినిమా కు ఒక దెబ్బ అయితే మరో అతి పెద్ద దెబ్బ ఐపీఎల్ 2022 సీజన్ అంటూ విశ్లేషకులు అభిప్రాయంని వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 25వ తేదీన ఆర్ ఆర్ ఆర్
సినిమా విడుదల కాబోతుండగా..
మార్చి 26వ తేదీన ఐపీఎల్ సంరంభం ప్రారంభం అవ్వబోతుంది. ఇక ఈసారి కొత్త జట్లు రావడంతో పాటు ప్రత్యేకంగా గ్రూప్ లుగా మ్యాచ్ లు అనేవి జరుగబోతున్నాయి.గ్రూప్ లుగా మ్యాచ్ లు జరగడం ఇంకా అలాగే కొత్త ఆటగాళ్లు.. అలాగే టీమ్ లో కొత్త మార్పులు చేర్పులు వంటి అనేక కారణాల వల్ల ఐపీఎల్ పై జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఆర్ ఆర్ ఆర్
సినిమా ఓపెనింగ్స్ కు ఐపీఎల్ దెబ్బేసే చాన్సులు కనిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాను విడుదల చేయకుండా వాయిదా వేద్దామా అంటే అసలు ఆ అవకాశం మేకర్స్ వద్ద లేదనే చెప్పాలి. ఎందుకంటే అన్ని సార్లు వాయిదా కనుక వేస్తే ఈ సినిమాపై ఖచ్చితంగా జనాలకు ఆసక్తి అనేది పోతుంది.