అభిమానులకు షాక్.. ఆస్పత్రిలో కచ్చా బాదం సింగర్?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అప్పుడు వరకు ఎవరికీ తెలియని సామాన్యులు సైతం ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లో స్టార్ లుగా మారిపోతున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఎంతోమంది ఊహించని రేంజ్ లో ఫేమస్ అవుతూ దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. ఇక అలాంటి వారిలో కచ్చ  బాదం  పాట పాడి ఒక్కసారిగా ఫేమస్  సింగర్ గా మారిపోయిన భువన్ కూడా ఉన్నాడు. .

 ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన భువన్ పల్లీలు అమ్ముకునేందుకు ఒక పాటను రాసుకోవడంతో.. ఇక ఆ పాట తన జీవితాన్నే మార్చేసింది. అతను పాడిన కొత్త పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో ఓవర్ నైట్ లో భువన్ సెలబ్రిటీ అయిపోయాడు. అతను పాడిన పాట ఎక్కడ చూసినా వినిపిస్తుంది. చిన్నారులు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కాలు కదిపేలా చేస్తుంది కచ్చా బాదం పాట. ఇలా పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఇక ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు.

 ఇకపోతే ఇటీవలే ఖచ్చ బాదం సింగర్ అభిమానులందరికీ కూడా ఊహించని షాక్.. కచ్చ బాదం సింగర్ భువన్ ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. కారు ప్రమాదంలో అతని చేతికి బలమైన గాయం అయింది అని తెలుస్తోంది. దీంతో భువనాలు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది అని తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదించిన భువన్  సెకండ్ హ్యాండ్ లో ఒక కారు కొన్నాడు. ఇక అతనికి డ్రైవింగ్ రాకపోవడంతో నేర్చుకుంటున్నాడు. ఇందులో భాగంగానే  అతని కారుకు ప్రమాదం చోటుచేసుకుంది. అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: