భీమ్లా నాయక్ పై పోలీస్ కేసు.. ఏం జరిగిందంటే?

praveen
అదేంటోగాని ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రతి సినిమా ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని ఉంటుంది. ఇలా వివాదాలు లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా నేటి రోజుల్లో లేకుండా పోయింది అని చెప్పాలి. సినిమాలలో కొన్ని సన్నివేశాల కారణంగా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ పోలీసులను ఆశ్రయించడం చేస్తున్నారు ఎంతోమంది. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా కి కూడా ఇలాంటి ఒక వివాదమే ఎదురైంది. పవన్కళ్యాణ్ రానా ప్రధాన పాత్రలో నటించిన భీమానాయక్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.



 అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ వసూళ్ల దిశగా ముందుకు సాగుతోంది భీమ్లా నాయక్ సినిమా. ఇక చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్లో భీమ్లా నాయక్ ఒక ఒక సాలిడ్ హిట్ సినిమా అని చెప్పాలి. ఇక పవన్ నటించిన సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది అని అభిమానులు సంతోషం లో ఉన్న సమయంలో ఇటీవలే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా పై కేసు నమోదయింది. భీమ్లా నాయక్ సినిమాలో కుమ్మరుల మనోభావాలను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అంటూ ఆరోపిస్తూ ఏపీ కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు.



 గుంటూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని ఈ ఫిర్యాదులు అందజేశారు పురుషోత్తం. తాము ఎంతో పవిత్రంగా భావించే కుమ్మరి చక్రం ను రానా కాలితో తన్నే సన్నివేశం కుమ్మరుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఇక వెంటనే ఆ సన్నివేశాన్ని సినిమాలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు ఆయన. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: