శర్వానంద్ తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది...రష్మీక మందన..!

Pulgam Srinivas
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించింది,  ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు.  ఈ సినిమా మార్చి 4 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది,  కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది,  కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం వాయిదా వేసింది.  


ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్రం బృందం  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది,  అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను కూడా చిత్ర బృందం వేగవంతం చేసింది,  అందులో భాగంగా తాజాగా రష్మిక మందన మీడియాతో ముచ్చటించింది. అందులో భాగంగా రష్మిక మందన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది,  ఈ మూవీ లో  తన పాత్ర పేరు ఆద్య అని, ముక్కుసూటి మనిషి, ఏ మాత్రం మొహమాటం లేకుండా అనుకుంటే చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు అంటూ తన పాత్ర తీరుతెన్నుల గురించి రష్మిక మందన వివరించింది, కిషోర్ తిరుమల తో పని చేయడం సరదాగా అనిపించింది. శర్వానంద్ తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది అని రష్మిక మందన తెలియజేసింది, ఇలా రష్మిక మందన తాజా ఇంటర్వ్యూ లో అనేక విషయాలను తెలియజేసింది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు, ఇప్పటికే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది,  మరి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: