దీపికాకి చాలా ఘోరమైన అవమానం..

Purushottham Vinay
ఇక ఫామ్ లో ఉన్న హీరోయిన్లను ట్రోల్ చెయ్యడం అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. కానీ మన హీరోయిన్లు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే అలాంటి ట్రోలింగ్స్ లో కొన్ని బాధించే సలహాలు ఇంకా అలాగే విమర్శలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా బాడీ షేమింగ్ కామెంట్స్ అనేవి హీరోయిన్లను బాగా ఇబ్బంది పెడుతుంటాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కి కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ అనేవి ఇక తప్పలేదట. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది ఈ పొడుగు కాళ్ళ బ్యూటీ దీపికా పదుకోన్.ఇక తన బ్రెస్ట్ సైజుని పెంచుకోమంటూ ఓ వ్యక్తి తనకు సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చింది దీపికా. ఆ టైంలో తనకు చాలా కోపం వచ్చిందని.. కానీ ఆ ఘటనను తను చాలా త్వరగా మర్చిపోయానని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఈమధ్య ఓ ఇంటర్వ్యూ లో తనకు జీవితంలో ఎదురైనా అతి చెత్త సలహా ఏంటంటూ దీపికా పదుకోన్ ను ప్రశ్నించారు ఓ జర్నలిస్ట్.



ఇక దీనికి సమాధానంగా దీపిక .. తన ఎద సైజు పెంచుకోమంటూ వచ్చిన సలహానే తనకు అతి చెత్త సలహాగా పేర్కొంది. అయితే ఆ సలహా ఇచ్చింది ఎవరనే విషయాన్ని మాత్రం దీపికా అసలు చెప్పలేదు. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను తన జీవితంలో బెస్ట్ సలహా ఇచ్చిన వ్యక్తిగా ఆమె పేర్కొంది. తెలిసినవాళ్లతో సినిమాలు చేయమని షారుఖ్ ఆమెకు సూచించాడట. సినిమాలు చేయడమంటే కేవలం నటించడం కాదని ఇంకా జీవితంలో ఓ భాగమని.. కాబట్టి కొన్ని జ్ఞాపకాల్ని ఇంకా అలాగే అనుభవాలను పొందే క్రమంలో తెలిసిన వాళ్లతో ట్రావెల్ చేయడమే మంచిదని షారుఖ్ ఖాన్ తనకు చెప్పినట్లు దీపికా వివరించడం జరిగింది.దాదాపు చాలా కాలం నుంచి కూడా దీపిక బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: