దళపతి విజయ్ ఫై ట్రోల్స్.. ఇన్నాళ్లకు తీరిందా అంటూ?

praveen
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజకుమార్ హఠాత్ మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా పునీత్ రాజ్కుమార్ అభిమానులు అయితే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 46 ఏళ్ల వయసులోనే పునీత్ రాజ్కుమార్ హఠాత్ మరణం అభిమానులందరినీ కూడా శోకసంద్రంలో ముంచేసింది అని చెప్పాలి. కేవలం కన్నడ అభిమానులు మాత్రమే కాదు ఇతర భాషల అభిమానులు కూడా ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. అయితే ఒకప్పుడు వివిధ కారణాల ద్వారా చివరి చూపుకు రాలేకపోయిన వారు ఇక ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ పునీత్ రాజ్కుమార్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.

 అయితే పునీత్ రాజ్కుమార్ మరణం సమయంలో ఆయనను చూడటానికి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ మంది హీరోలు రాకపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇకపోతే ఇటీవలే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి  పునీత్ రాజ్కుమార్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు.. అయితే విజయ్ దళపతి పూనీత్ కు నివాళులు అర్పించడం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పునీత్ అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.పునీత్ రాజ్కుమార్ లాంటి గొప్ప వ్యక్తి  చనిపోయిన ఇన్నాళ్లకు సంతాపం తెలియజేసి నివాళులర్పించడానికి ఇన్నాళ్లకు టైం దొరికిందా అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.


 కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఒక గొప్ప వ్యక్తిగా ఉన్న వ్యక్తికి నివాళులర్పించడానికి ఇన్నాళ్ళ వరకు సమయం దొరకనంత బిజీగా ఉన్నావా అంటూ మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించడానికి రాలేదని ఏదో పనిమీద బెంగళూరు వచ్చి.. పనిలో పనిగా పునీత్ సమాధిని సందర్శించేందుకు వచ్చాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు ట్రోల్స్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: