అలా చేయడం నాకు అస్సలు నచ్చదు : షణ్ముఖ జస్వంత్
ఇక అక్కడ తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయ్యాడు షణ్ముఖ్ జస్వంత్. హౌస్ లోకి వెళ్లి పోయిన తర్వాత అతని ఫాన్స్ ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో పెరిగింది అని చెప్పాలి. అయితే షణ్ముఖ్ యూట్యూబ్ వేదికగా ఫేమస్ అయినప్పటికీ అటు ఇంటర్వ్యూలు ఇవ్వటానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉంటాడు. ఇటీవలే ఇంటర్వ్యూలు ఇవ్వడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు షణ్ముఖ్ జస్వంత్. ఇటీవలే మా అమ్మ హోమ్ టూర్ చేసిందని అలా చేయడం తనకు అస్సలు నచ్చలేదు అని షణ్ముఖ్ జస్వంత్ కామెంట్ చేశాడు అయితే ఫ్యామిలీ మెంబర్స్ ను ఎవరైనా ట్రోల్ చేస్తే అస్సలు తట్టుకోలేనని షణ్ముఖ్ జస్వంత్ చెప్పుకొచ్చాడు.
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షణ్ముఖ్ జస్వంత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఇంటర్వ్యూలు చేస్తే అనవసరమైన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకే నేను ఎక్కువగా ఇంటర్వ్యూలకు హాజరు అంటూ షణ్ముఖ్ జస్వంత్ చెప్పుకొచ్చాడు. అయితే ఇన్ని రోజుల వరకు అసలు ఈ ఫేమస్ యూట్యూబర్ ఇంటర్వ్యూలకు ఎందుకు దూరంగా ఉన్నాడా అని అందరిలో ఒక అనుమానం వుండేది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు ఇంటర్వ్యూ లకు దూరంగా ఉంటాను అన్న విషయం పై స్పందించడంతో ఇక అభిమానులందరికీ కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి..