ఆ బ్యూటీలు బాగా తెగించేశారు.. బోర్డర్స్ దాటేస్తున్నారు..!
మాధురీ దీక్షిత్‌కి బాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. మాధురీకి 54 ఏళ్లు వచ్చినా ఆ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. రణ్‌బీర్ కపూర్ లాంటి స్టార్స్ కూడా మాధురీ అంటే వెర్రెక్కిపోతున్నారు. అయితే ఇంత ఫాలోయింగ్ ఉన్నా సినిమాల్లో ఎప్పుడూ బౌండరీస్ క్రాస్ చేయలేదు. అయితే మొదటిసారి వెబ్ సీరీస్ కోసం హద్దులు చెరిపేసుకుంది. 'ది ఫేమ్ గేమ్'లో మాధురీ బోల్డ్ రోల్ ప్లే చేసింది.
సమంత ఎక్కువగా కమర్షియల్ మూవీస్ చేసినా ఎప్పుడూ గ్లామర్ గేట్లు ఎత్తలేదు. సెమీ మోడ్రన్ లుక్‌లోనే కనిపించింది. అయితే 'ఫ్యామిలీమెన్2'తో ఫస్ట్ టైమ్ వెబ్ సీరీస్‌లోకి అడుగుపెట్టాక, పాత లెక్కలన్నిటిని పక్కనపెట్టేసింది. చాలెంజింగ్ రోల్ అని బోల్డ్ సీన్స్‌లోనూ నటించింది. రాజీ క్యారెక్టర్లో సమంతని చూసి టాలీవుడ్ జనాలు కూడా సర్ప్రైజ్ అయ్యారు.
కియారా అద్వాని ఇప్పుడు బాలీవుడ్ నంబర్ గేమ్‌లో తెగ హడావిడి చేస్తోంది. పాన్ ఇండియన్ మూవీస్‌తో కోట్లు అందుకుంటోంది. అయితే కియారా ఇంత బిజీ అవ్వడానికి వెబ్ ఫిల్మ్ 'లస్ట్‌స్టోరీస్' కారణమని చెప్పొచ్చు. అడల్ట్ లైన్‌తో వచ్చిన ఈ సీరిస్‌లో కియారా బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసింది. ఇక ఆ క్యారెక్టర్‌తో యూత్‌కి ఫుల్లుగా కనెక్ట్ అయింది. బాలీవుడ్లో బిజీ అయింది.