హీరోయిన్ తాప్సీ@9.. జాతర మామూలుగా లేదుగా..!!

frame హీరోయిన్ తాప్సీ@9.. జాతర మామూలుగా లేదుగా..!!

Divya
హీరోయిన్ తాప్సీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పటి వరకు బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తాప్సీ.. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా అవకాశం ఎదురుచూసింది ఈ ముద్దుగుమ్మ. అదృష్టం కొద్దీ అవకాశాలు తలుపు తట్టడం తో సక్సెస్ సాధించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఈమె కెరియర్ ఆరంభంలో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా సాగింది. కానీ అనూహ్యంగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈమె స్టార్ స్టేటస్ ఒక్కసారిగా మారిపోయింది.


బాలీవుడ్ లో కూడా మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి ఆ తరువాత హీరోయిన్ గా ఎదిగింది తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా ఉన్నది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు తాప్సీ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం 9. ఈ సినిమాల షూటింగులను చేసుకుంటూనే మరొకవైపు సరికొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం తాప్సీ నటిస్తున్న ఈ 9 సినిమాలు వివిధ దశలలో షూటింగ్లో ఉన్నాయి.. ఎక్కువ సినిమాలు షూటింగ్ ముగించుకొని త్వరలోనే మన ముందుకు విడుదల కాబోతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం షూటింగ్ మధ్యలోనే ఉన్నాయి. ఇక ఇదే తరుణంలోనే మరికొన్ని ఆఫర్లు కూడా రానున్నాయి ఈమెకు.


కరోనా నేపథ్యంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఒక సినిమాని తాప్సి త్వరలోనే విడుదల చేయబోతోంది. ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక గతంలో కూడా అనుభవ్ తో కలిసి ఎన్నో సినిమాలను తెరకెక్కించింది తాప్సి అందుచేతనే ఆయన నిర్మాణంలో నటించేందుకు ఒప్పుకున్న ట్లుగా సమాచారం. అంతే కాకుండా ఆయన డైరెక్షన్లో పనిచేసిన ఏ సినిమా అయినా తప్పకుండా విజయం సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈమె తొమ్మిది సినిమాలు ఒకేసారి చేయడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: