తనికెళ్ల భరణి : ఆ ఫైట్ మాస్టర్ వల్ల ఎంతో భాధ పడ్డాను...!!

frame తనికెళ్ల భరణి : ఆ ఫైట్ మాస్టర్ వల్ల ఎంతో భాధ పడ్డాను...!!

murali krishna
సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలకు సంబంధించిన విషయం ఏదైనా వచ్చిందంటే చాలుగా అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఎవరైనా తమ పర్సనల్ లైఫ్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి చెబితే కనుక అదే సోషల్ మీడియాను ఊపేస్తు ఉంటుంది.

ఇప్పుడు టాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న తనికెళ్ల భరణి గురించి ఒక వార్త మాత్రం వైరల్ గా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా దర్శకుడిగా రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మన తనికెళ్ల భరణి. ఇక ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు ప్రాణం పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య 

కేవలం తెలుగులోనే కాదు తమిళ కన్నడ హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 750 చిత్రాలకు పైగా నటించిన తనికెళ్ల భరణి ప్రేక్షకులందరికీ కూడా బాగా దగ్గరయ్యారు. తండ్రి పాత్రలో నటించిన తాత పాత్రలో నటించిన ఇక ఆ పాత్రకి పూర్తి న్యాయం చేయగలరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ల భరణి కెరీర్ గురించి మాట్లాడుతూ సంచలన విషయాన్ని బయటపెట్టారట.ఒకానొక సమయంలో ఒక ఫైట్ మాస్టర్ దారుణంగా అవమానించాడూ అంటూ ఎమోషనల్ అయ్యారట.. నేను వివాహం చేసుకొని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు రాళ్లపల్లి ఇంట్లో అద్దెకు ఉండే వాడినని 

ఇక తన ఇంటికి వచ్చిన ఫైట్ మాస్టర్ భీమరాజు అనే వ్యక్తి ఏంటయ్యా కొత్తగా పెళ్లయిందా ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నావ్ అంటూ నవ్వుతూ మాట్లాడుతూ.. నాకు పెద్ద ఇల్లు ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకు ఇవ్వాలి అనుకుంటున్నాను కావాలి అనిపిస్తే చెప్పు వచ్చి చూడు అని చెప్పాడు. ఇక వెళ్లి చూడగా ఇల్లు కూడా నాకు నచ్చింది. అయితే ఇక అప్పట్లోనే లక్షల రూపాయలు ఇచ్చాననిఒక సంవత్సరం పాటు అదే ఇంట్లో ఉన్నాను.. ఆ తర్వాత అవకాశాలు లేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న సమయం లో ఆ ఫైట్ మాస్టర్ వచ్చి డబ్బు మొత్తం ఒకేసారి చెల్లించాలని లేదంటే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపొమ్మన్నాడని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ మాట అనే సరికి బాధేసింది అంటూ తనికెళ్ల భరణి భాధ పడ్డాడు.. అయితే అప్పటివరకు తాను ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వమన్నా ఇవ్వలేదని చాలా కష్టం మీద 75 వేల వరకు తిరిగి వసూలు చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారట తనికెళ్ల భరణి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: