కోలీవుడ్ స్టార్
హీరో అజిత్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ
హీరో నటించిన అనేక
తమిళ సినిమాలను
టాలీవుడ్ లో కూడా విడుదల చేసి
టాలీవుడ్ లో కూడా
అజిత్ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే
అజిత్ కొంత కాలం క్రితం నటించిన విశ్వాసం సినిమాను కూడా తెలుగు లో విడుదల చేశాడు, ఈ
సినిమా కూడా తెలుగు లో పర్వాలేదు అనే రేంజ్ లో విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా
అజిత్ నటించిన వలిమై
సినిమా కూడా
తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యింది, ఈ సినిమాలో
టాలీవుడ్ యువ
హీరో కార్తికేయ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు, ఈ సినిమాను అదిరి పోయే
బైక్ యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ
సినిమా ఫిబ్రవరి 24 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయ్యింది, ఈ
సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే రోజు విడుదల అయ్యింది.
అయితే ఈ
సినిమా కోలీవుడ్ మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది, వలిమై
సినిమా తమిళ నట మొదటి రోజు రోజు 36. 17 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది, ఇలా వలిమై
సినిమా తో
కోలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్నాడు, ఇది ఇలా ఉంటే వాలిమై
సినిమా రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన 2.0' .. 'అన్నాత్తే' కి మించి
కోలీవుడ్ లో కలెక్షన్ లను రాబట్టినట్లు తెలుస్తోంది, ఈ సినిమాలో హుమా ఖురేషి
హీరోయిన్ గా నటించింది. మరి రాబోయే కాలంలో వలిమై
సినిమా కోలీవుడ్ లో ఇండస్ట్రీ లో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.