రవి తేజ ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ రెడీ..ఎప్పుడంటే?
క్రాక్ సినిమా తర్వాత ఖిలాడీ సినిమా లో నటించాడు.. ఆ సినిమా ఫిబ్రవరి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా వచ్చి అలా వెళ్ళి పోయింది. అనుకున్న టాక్ ను అందుకోలేకపోయింది.. అయిన వెనకడుగు వెయ్యకుండా మరో సినిమా పై ఫోకస్ చేసాడు. రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా చిత్రాల తో బిజిగా ఉన్నాడు. శివరాత్రి కానుకగా రవితేజ ఫ్యాన్స్ మాస్ ట్రీట్ ను ఇవ్వనున్నారు. ఈయన నటిస్తూన్న రామరావు ఆన్ డ్యూటీ నుంచి అదిరిపొయె అప్డేట్ వచ్చింది..
గతంలో సినిమాలకు ఈ సినిమా భిన్నంగా కథ ఉండనుంది.యాక్షన్ ఎంటర్టైనర్ కు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు.. కాగా, ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ టీజర్ ని మార్చి 1 న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ లో రవితేజ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తాడు.సినిమాపై రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో రవితేజ ఆన్ డ్యూటీ అని పేరు కూడా మార్చుకున్నాడు. ఆ సినిమా ఎలా వుంటుందో చూడాలి..