అర్రే: పవన్ ఫ్యాన్స్ పూనకం మాములుగా లేదుగా...!!
నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేలో ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళీ చిత్రం అయ్యప్పన్ కోషియంకి ఇది రీమేక్. పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు థియేటర్స్ లోకి వచ్చేసింది.
యూఎస్ తో పాటు తెలంగాణలో కూడా ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఎక్కడ చూసిన థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు.సినిమాకి పాజిటివ్ రావడంతో అభిమానులు పూనకంతో ఊగిపొతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్స్ దగ్గర ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ అభిమాని తన చేతిని బ్లేడ్‌తో కోసుకొని పవన్ కటౌట్‌కి నెత్తురు అద్ధారు.
అభిమానుల కోలాహాలం మధ్య అతని వికృత చేష్టలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇక కొందరు యువకులు అయితే ఆటో వెనక పవర్ స్టార్ కటౌట్ ఏర్పాటు చేసుకొని సాహసాలు చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు చేసిన ఫీట్స్ చూసి అందరు ఆశ్చర్యపోయారు.
ఇక ఒక మహిళా అభిమాని పవన్ కళ్యాణ్ కటౌట్ పైకి ఎక్కి పవన్ కు పాలాభిషేకం చేసింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మెడ లో ఎర్రటి గుడ్డను ధరించి, పాల ప్యాకెట్‌ను నోటితో చింపి, పవన్ కటౌట్‌పై పోసింది. పవన్‌కి ఆడవాళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు.
పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో భీమ్లా తో మరోసారి నిరూపించారు. ఆయన నిజంగా వ్యసనమే అందుకే ఆయన ఫ్యాన్స్ అంతలా తల్లడిల్లి పోతుంతారు. ఆయన కోసం ఏదైనా చేస్తారు వారు.