భీమ్లానాయక్ సినిమా ఫీవర్.. భారీగా ఉద్యోగులు సెలవు..

Satvika
ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు భీమ్లానాయక్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. పవన్ కళ్యాణ్, రానా లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా పవన్ కు జోడిగా నిత్యామీనన్ నటించగా, రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. పోస్టర్ నుంచి సాంగ్స్, టీజర్ వరకూ ప్రతిధి కూడా అభిమానులకు మరింత ఆసక్థిని పెంచుతున్నాయి..


మొన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో అందరు మాట్లాడిన మాటలు అభిమానుల తో పాటుగా అందరినీ తెగ ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. సోషల్ మీడియా కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. పవన్ ఫీవర్ జనాలకు ఎ మాత్రం వుందో ప్రత్యెకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలతో పాటుగా రాజకీయాల లో కూడా చురుగ్గా ఉన్న నేపథ్యంలో ఆయన సినిమాలకు ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు. భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదల అవుతున్న ఆ సినిమా ఈరోజు ప్రెక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల అవ్వక ముందే సినిమా హిట్ టాక్ ను అందుకుంది.


ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలకు క్రేజ్ ఎక్కువే..సినిమా విడుదల అవుతుంది అంటే యూత్ తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వారం రోజులు ముందే టిక్కెట్ బుక్ చేసుకోవడం అలాగే ఆఫీస్ లకు సెలవు పెట్టడం చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఓ కంపెనీ ఉద్యోగులు భారీ సంఖ్యలో ఆఫీస్ కు సెలవు పెట్టి మరీ సినిమాలకు వెళ్తున్నారు. ఇది వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజం.భీమ్లానాయక్‌ ఫీవర్‌ కియ పరిశ్రమ పై పడింది. సినిమా శుక్రవారం విడుదల కానుండటంతో అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కార్ల కంపెనీలో పని చేసే 400 మంది విధులకు సెలవు పెట్టారు..సైడ్‌లైన్‌ వర్కర్స్‌ ఒకేరోజు అధిక సంఖ్యలో సెలవు తీసుకోవడంతో ఏంచేయాలో తోచక శుక్రవారం పరిశ్రమకు సెలవు ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందని తెలియాల్సి వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: