టికెట్ల రేట్లపై నిర్మాత నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్..

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ప్ర్రభుత్వంతో సినీ పెద్దలు ఎన్ని మీటింగ్స్ నిర్వహించినా ఉపయోగం లేకుండా పోతుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ ఉండటంతో ఎవరైనా టికెట్స్ చెప్పిన రేట్లకి కాకుండా ఎక్కువ అమ్మినా లేక బెనిఫిట్ షోలు వేసినా కాని తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.సినిమా పెద్దలు కలిసినప్పుడు మాత్రం అన్నిటికి ఓకే చెప్పి, త్వరలో కొత్త జీవోలు వస్తాయని చెప్పి, ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ కళకళలాడుతుంది చెప్పి వారు వెళ్ళిపోయినా తర్వాత అదే పాత చింతకాయ పచ్చడి అన్నట్టు వ్యవహరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో పవన్ సినిమా అంటే ఇంకా ఎక్కువగా ఫోకస్ పెడుతుంది థియేటర్ల మీద. దీంతో తాజాగా ఫిలిం ఛాంబర్ ఇంకా నిర్మాతల మండలి ఓ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ తరువాత ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.



ఇక ప్రెస్ మీట్‌లో నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. ”నిర్మాతల మండలి ఇంకా ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టటానికి కారణం పాత జీవో, సస్పెండ్ అయిన జీవో 35 ప్రకారం ఉన్న రేట్లతో సినిమా టికెట్లని ఇక అమ్మమని రెవిన్యూ వారు ఎగ్జిబిటర్స్ ను బెదిరిస్తున్నారు. దీనిపై భరోసా ఇవ్వాల్సిన భాద్యత అనేది ఫిలిం ఛాంబర్ కు ఉంది. మేము ఏపి ప్రభుత్వాన్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. తనిఖిలు చేయటం అనేది తప్పుకాదు. కానీ సస్పెండ్ అయిన జీవో రేట్లకు అమ్మమనటం చాలా తప్పు. ఏ థియేటర్స్ వారిని కూడా అన్ అఫీషియల్ గా కూడా ఇబ్బందిపెట్టొదని మనవి. సీఎం జగన్ గారు ఈ విషయంపై అందరి అధికారులకు మీరు క్లారిటి ఇవ్వాలని కోరుతున్నాం. సినిమాను కేవలం సినిమాలానే చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తనీఖీలు చేసి లెసెన్స్ లేకపోతే, బ్లాక్ మార్కెట్ పై సీరియస్ యాక్షన్ తీసుకొండి కానీ ఇలా ముఖ్యమంత్రి జగన్ గారికి తెలియకుండా కొందరు అధికారులు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికే చాలా ఇబ్బంది అవుతుంది. అలా ఎగ్జిబిటర్ లపై బెదిరింపులకు పాల్పడితే న్యాయపరమైన చర్యలకు వెళతారు. కొత్త టికెట్ రేట్లని అమలు చేయాలని కోరుతున్నాం. అలానే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాకు భరోసా ఇస్తారని ఆశిస్తున్నాం.” అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: