సమంత:వర్కౌట్స్ అంటే ఇలా కూడా చేస్తారా..?

Divya
 సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.. సమంతకు సంబంధించి ఎక్కడో ఒక చోట ఫోటో కానీ వీడియో కానీ తెగ వైరల్ అవుతుంది సందడి చేస్తూ ఉంటాయి.. ముఖ్యంగా ఈమె వర్కౌట్ చేసే వీడియోలు ఫోటోలు అప్పుడప్పుడు జనాల లో చర్చనీయాంశంగా కూడా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా నల్గొండ లో ఒక షాపింగ్ మాల్ ను ఓపెన్ చేసి కి వెళ్లి అక్కడ దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అంతలోనే ఇప్పుడు మరొక జిమ్ వర్కౌట్ తో కష్టపడుతున్న ట్లుగా ఒక వీడియో పెట్టిన వైరల్ గా మారుతుంది.

 అత్యంత కష్టమైన బరువు ఎత్తు ఉన్న వీడియోలని గతంలో మనం చూసే ఉన్నాము సమంతవి.. కానీ ఇప్పుడు కేవలం కర్ర కు తగ్గట్టుగా తన బాడీ షేప్ ని మారుస్తూ ఒక కష్టమైన విషయాన్ని కూడా చేసింది. ఈ వర్కౌట్ చూసిన కొంతమంది నెటిజెన్స్ ఇవేం వర్కౌట్ రా బాబోయ్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఇంత ఫోకస్డ్గా మీరు ఎలా చేస్తున్నారు అంటూ ఆమె పై కామెంట్ చేయడం కూడా జరుగుతోంది. ఇంత కష్టపడుతోంది కాబట్టి ఈమె ఇలా కనిపిస్తోంది అంటూ మరి కొంత మంది అభిమానులు కామెంట్ చేయడం జరుగుతోంది.
సమంత ఫోటో షూట్ వీడియోలను, యోగాసనాలను కూడా వేసి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉండేది. ప్రస్తుతం శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.. సమంత తన సినీ కెరీర్ లో విలన్ గా హీరోయిన్ గా నటిస్తూ తనను తాను నిరూపించుకుంటూ వస్తోంది. రాబోయే రోజుల్లో హీరోయిన్ తాప్సీ తో కలసి కొన్ని సినిమాలలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత నటిస్తున్న ఏ సినిమా అయినా కూడా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: