భీమ్లా నాయక్ కి ఆంధ్రా సర్కార్ బిగ్ షాక్..

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నర్సాపురంలో ఏర్పాటు చేసిన ఓ మీటింగ్లో మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనగా వైఎస్సార్ సిపి ప్రభుత్వం పై ఆయన చేసిన కామెంట్స్ అనేవి తీవ్ర ధూమారాన్ని రేపడమే కాకుండా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న పవన్ 'భీమ్లా నాయక్' సినిమా పై పెద్ద ఎఫెక్ట్ పడేలా చేసింది.'భీమ్లా నాయక్' వంటి పెద్ద సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల కాబోతుండగా.. విడుదల రోజునాడు ఏపిలో 5వ షోకి అనగా బెనిఫిట్ షోలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించడం జరిగింది.ఇక ఎలాంటి అనుమతులు అనేవి లేకుండా బెన్ ఫిట్ షోలు కనుక ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. సినిమా టికెట్లు కూడా ప్రభుత్వ నిభందనలు మేరకే అమ్మాలని ఆదేశిస్తుంది.ప్రతి ధియేటర్ వద్ద కూడా రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుందని ,ధియేటర్ యాజమాన్యం కూడా సహకరించాలని చెప్పుకొచ్చింది.



జీవో నెంబర్ 35ని కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించుకుంది. 'అసలు పవన్ కళ్యాణ్ ను మేము ఏమాత్రం టార్గెట్ చేయలేదని… ఆయన సినిమాలకి అంత దమ్ము లేదని' ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ పేర్ని నాని ఇటీవల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.ఇక మరి అలాంటప్పుడు 'భీమ్లా నాయక్' సినిమా కు మాత్రమే ఇలాంటి కఠిన ఆంక్షలు అమలు చేయడం ఏంటి అనేది మాత్రం ఇప్పుడు అర్ధం కాని ప్రశ్న. అయితే ఈ విషయాల పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా బృందం వారు ఎలా రియాక్ట్ అవుతారో.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎన్ని కక్ష్య సాధింపు చర్యలు చేపడుతుందో అనేది చూడాలి.. ఇక ఈ సినిమాపై అభిమానులకు భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉంటుందని చిత్ర బృందం వారు ధీమాగా వున్నారు. ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: