వారి పై మరోసారి అసహనం వ్యక్తం చేస్తున్న సురేఖవాణి..!
సురేఖ వాణి ప్రస్తుతం కాకినాడ లో ఉంటోంది.. ఇక తనకు కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఉందని ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ఖాతాలు లేవని సురేఖ ఈ విషయాన్ని ఎన్నోసార్లు నెటిజన్లకు క్లారిటీ ఇచ్చింది కానీ ఇప్పుడు మరోసారి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా సురేఖవాణి మరోసారి అసహనం వ్యక్తం చేస్తూ తన పేరుతో ఎవరో కావాలని నకిలీ ఖాతాలను నడుపుతూ ఉండడంపై ఆమె ఫైర్ అయ్యింది.. ఇక తాను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను అని ట్విట్టర్ , ఫేస్ బుక్ లాంటి ఖాతాలు లేవు అని కేవలం ఉన్నది ఇంస్టాగ్రామ్ మాత్రమే అని సురేఖవాణి మరొకసారి అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.
ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ఖాతాలు లేవు అని ఒకవేళ మీకు అటువంటి మెసేజ్లు ఏమైనా వస్తే దయచేసి రియాక్ట్ అవ్వకండి అంటూ అభిమానులను అప్రమత్తం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సురేఖవాణి తన కూతురు సుప్రీత తో కలిసి రీల్ వీడియోలు చేసి వాటిని ఇన్స్టా లో వదులుతూ ఉంటారు. కూతురితో పోటీపడుతూ సురేఖ చేసే సందడి అంతా ఇంతా కాదు.. అంతేకాదు వీరు షేర్ చేసే ఏ వీడియో అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉండటం గమనార్హం.