ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లలో కొంత మందికి మొదటి సినిమా బాక్స్ ఆగిన్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఆ సినిమాలో ఆ ముద్దుగుమ్మల అందంతో మాత్రం ప్రేక్షకులను ఫిదా చేస్తూ ఉంటారు, అలా మొదటి సినిమాలో తమ అందాలతో ప్రేక్షకులను ఫిదా చేయడంతో ఆ తర్వాత ఆ ముద్దుగుమ్మలకు ఇండస్ట్రీలో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి, అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ లలో కేతిక శర్మ ఒకరు. ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ కేతిక శర్మ అందాలకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయిపోయారు, ఇలా మొదటి సినిమాతోనే అందాలతో అలరించిన కేతిక శర్మ ఆ వెంటనే నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినా కేతిక శర్మ అందాలకు మాత్రం తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోవడంతో ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు దక్కుతున్నాయి, అందులో భాగంగా ప్రస్తుతం కేతిక శర్మ 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు, ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిస్తున్న మూడో సినిమా రంగ రంగ వైభవంగా, ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే కేతిక శర్మ కెరియర్ డేంజర్ జోన్ లో పడే అవకాశం ఉంటుంది.