ఈ సినిమాలో
కార్తికేయ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి, ఇలా మొదటి సారి విలన్ పాత్రలో కనిపించి మెప్పించిన
కార్తికేయ తాజాగా
అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ
సినిమా ఈ నెల 24 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ
సినిమా విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించిన
కార్తికేయ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు, ఈ క్రమంలో
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ రోల్ వస్తే చేస్తారా ? అనే ప్రశ్నకు
కార్తికేయ స్పందిస్తూ..
మెగాస్టార్ సినిమాలో విలన్ గా చేయగల్గుతానా లేదా అనేది నా డౌటు, విలన్ పాత్ర అంటే ఆయన ముందు నిలబడి డైలాగ్ చెప్పాలి ఆయనను చూస్తే అనే కిందామీదా అవుతాను ఇక నటించే అవకాశం ఎక్కడ ఉంటుంది, ప్రతినాయకుడి పాత్రలో కాకపోయినా ఆయన సినిమాలో చిన్న పాత్రలో నటించలి అని ఉంది. నా అభిమాన హీరోతో ఒక
మూవీ చేశాను అనే సంతోషం.. మంచిరోల్ చేశాననే సంతృప్తి నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి, అలాంటి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ
కార్తికేయ చెప్పుకొచ్చాడు.