కచ్చా బాదం సింగర్ కి అదిరే ఆఫర్.. ఎక్కడ పాడాడో చూడండి?
ఇక అలాంటి టర్నింగ్ పాయింట్ వచ్చిన తర్వాత తిరుగుండదు అని చెబుతూ ఉంటారు. ఇక ఇటీవల సోషల్ మీడియా కారణంగా ఎంతో మందికి అలాంటి టర్నింగ్ పాయింట్ వచ్చేస్తోంది. ఇటీవలే పశ్చిమ బెంగాల్కు చెందిన భుజన్ బాధ్యాకర్ కూ కూడా ఇలాంటి అవకాశం వచ్చింది. తాను పల్లీలు అమ్ముకోవడానికి పాడుకున్న ఒక పాట అతని సెలబ్రేటిని చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ గా మారిపోయింది. ఇక అతని ఓవర్ నైట్ సెలబ్రిటీ ని చేసింది అని చెప్పాలి. పల్లీల అమ్ముకునే అతని సంపాదన కూడా క్రేజ్ తో పాటే పెరిగి పోతూ ఉండటం గమనార్హం.
ఇక ఇటీవలే కోల్కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కచ్చ బాదం పాటను పాడటానికి అతన్ని పిలిపించారు. ఈ క్రమంలోనే స్టేజ్ మీదకి వెళ్ళిన భుజన్ బాధ్యాకర్ కచ్చ బాదం పాటను పాడి వినిపించారు. దీంతో అక్కడున్న వారందరూ కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. అంతేకాదు ఆయనతో కలిసి కోరస్ కూడా అందించారు అక్కడ ఉన్న కస్టమర్స్. వన్స్ మోర్ అంటూ మరోసారి అతనితో పాట పాడించుకుని తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక అతనికి ఒక్కసారిగా వచ్చిన క్రేజ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.