సౌత్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు మంచి తెచ్చుకున్న కీర్తి సురేష్.. రీసెంట్ గా 'గుడ్ లక్ సఖి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే...
కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఓటీటీలో కూడా అస్సలు వర్కవుట్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా కీర్తికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయట.. ప్రస్తుతం నాని 'దసరా' సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబుతో కలిసి 'సర్కారు వారి పాట' సినిమా కూడా చేస్తోంది.
అలానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలిగా కీర్తి కనిపించనుంది. మలయాళంలో 'వాశి' అనే సినిమాలో ఆమె నటిస్తోంది. ఇందులో టొవినో థామస్ హీరోగా నటిస్తున్నాడట. ఈ సినిమాలో కీర్తి సురేష్ లాయర్ గా కనిపించనుందని వీటితో పాటు మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.. ఇప్పుడు సినిమాలతో పాటు ఓ మ్యూజికల్ వీడియోలో కూడా నటిస్తోందట కీర్తి సురేష్. 'గాంధారి' అనే మ్యూజికల్ వీడియోతో ప్రేక్షకులను అలరించబోతుందట కీర్తి సురేష్.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిందట కీర్తి సురేష్. ఓ పోస్టర్ ను కూడా ఆమె విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేష్ లెహంగా వేసుకొని డాన్స్ చేస్తూ ట్రేడిషనల్ గా కనిపించింది. ఈ మ్యూజిక్ వీడియోకు 'లవ్ స్టోరీ' ఫేమ్ పవన్ సి.హెచ్ మ్యూజిక్ అందించారట. బృంద కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారని పూర్తి పాటను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారని తెలుస్తుంది.సోనీ సంస్థ ఈ పాటను నిర్మించిందని సమాచారం..మహానటి తో మంచి ప్రేక్షక ఆదరణ పొందిన కీర్తి సురేష్ ఆ తరువాత అలాంటి సినిమాకోసం ఎదురు చూస్తుంది. ప్రతి సినిమా కూడా ఎంతో శ్రద్ధగా తన మొదటి సినిమాల చేస్తుంది కీర్తి సురేష్.