రియల్ హీరో సోనూ సూద్ పై ఈసి ఆంక్షలు..

Purushottham Vinay
కరోనా వైరస్ మహమ్మారి విజృంభన వచ్చినప్పటి నుంచి మన దేశంలో వినిపిస్తున్న ఒకే ఒక్కపేరు సోనూసూద్ అనే చెప్పాలి. ఎంతో మందికి కూడా ఈ ఆపద కాలంలో ఆయన చాలా అండగా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సోనూ సూద్ ఎన్నో రకాలుగా సాయం అందిస్తున్నారు.అడిగింది లేదనకుండా ఆయన ఎంతగానో ఆదుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన అందరికి నేషనల్ రియల్ హీరోగా మారిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే..పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఈ రియల్ హీరో సోను సూద్ కు ఊహించని పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ దేశం మెచ్చిన గొప్ప నిజమైన నటుడు సోనుసూద్‌కు అక్కడి పోలీసులు గట్టిగా షాక్ ఇచ్చారు. ఇక ఓ పోలింగ్ బూత్ పరిశీలించి ప్రయత్నించగా సోనూసూద్ ని అధికారులు అడ్డుకున్నారు. అలాగే సోను సూద్ కారును వారు సీజ్ చేసి… ఆయనను తిరిగి ఇంటికి పంపించారు. తన సోదరి అయిన మాళవిక సూద్ మెగా స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.


ఇక ఆదివారం నాడు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎన్నికల అధికారులు ఆయనని అడ్డుకున్నారు.అలాగే సోనూసూద్‌ కారును సీజ్ చేయడమే కాకుండా… తన ఇంటి నుంచి బయటికి వస్తే తగిన చర్యలు కూడా తీసుకుంటామని ఆ అధికారులు సోనూ సూద్ ని హెచ్చరించడం జరిగింది.ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇక ‘నిబంధనలకు విరుద్ధంగా ఓ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు రియల్ హీరో సోనూసూద్ ప్రయత్నించారు. దీంతో ఆయనను అడ్డుకొని ఆయన కారు సీజ్ చేశాం' అని అక్కడ పోలీసులు తెలిపారు.అయితే పోలీసుల తీరుపై సోనూ సూద్ అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోనూ సూద్ పై చర్యలు తీసుకుంటే ఊరుకోమని అధికారులను హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: