రేపే సినీ ప్రముఖుల భేటీ... ఎవరెవరు వస్తారో మరి...!

murali krishna
రేపు టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశం జరగనుందట. కనుక సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్‌కు చెందిన వారందరూ కూడా హాజరుకానున్నారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో ఈ సమావేశం జరగనుందని తెలుస్తుంది .

మొత్తం 240 మంది సభ్యులకు  గాను ఆహ్వానం అందినట్లుగా సమాచారం.. చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారట . ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమై చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించి వచ్చిన విషయం తెలిసిందే. టిక్కెట్ల ధరల తగ్గింపుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది కనుక త్వరలో టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో పాటు మరికొన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారట.

కాగా.. సినిమా టికెట్ల ధరపై (movie ticket rates) ప్రభుత్వం నియమించిన కమిటీ సర్కార్‌కు అందజేయాల్సిన సిఫారసులను కూడా సిద్ధం చేసింది. ఎప్పటిలాగే భౌగోళికంగా నాలుగు ప్రాంతాలుగా విభజించడం మరియు గ్రామీణ ప్రాంతాల్లో వున్న ప్రత్యేక సదుపాయాలు వున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను స్పెషల్ కేటగిరీ కింద పరిగణించాలని సిఫారసు చేసిందట.కార్పోరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు టికెట్ రేట్లు ఖరారు చేసిందని దానితో ఎకానమీ క్లాస్‌తో పాటు సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయని సమాచారం..

స్పెషల్ షోకి అనుమతి నిరాకరించి పెద్దా చిన్నా అన్ని చిత్రాలకు ఒకటే ధర నిర్ణయించింది ప్రభుత్వం. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లను తగ్గించి అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఆన్‌లైన్ టికెటింగ్‌కు సత్వర ఏర్పాట్లు కూడా చేస్తోంది. 50 శాతం ఆక్యూపెన్సీ నిబంధన కూడా ఎత్తివేసింది. ఇక రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేయడంతో పాత సమయాల్లోనే నాలుగు ఆటలు వుంటాయని టికెట్ రేట్లపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదికను అందజేయనుందట కమిటీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: