మీరు వర్జినా.. యాంకర్ ప్రశ్న.. హీరోయిన్ దిమ్మతిరిగే ఆన్సర్?

praveen
మీరు వర్జినా.. కాదా  గట్టిగా చెప్పండి.. అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది.. కోర్ట్ సీన్ లో ప్రకాష్ రాజ్ నివేద థామస్ ను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటాడు. అయితే సినిమాల్లో అయితే ఓకే కానీ ఇక ఇటీవల మాత్రం నిజంగానే ఒక యాంకర్ హీరో హీరోయిన్లను ఇదే ప్రశ్న అడిగి షాక్ కి గురి చేశాడు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం నిర్మాతలు లగడపాటి శిరీష్ శ్రీధర్ తనయుడు విక్రమ్  హీరోగా వర్జిన్ స్టోరీ అనే యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఇందులో సౌమిక పండియన్, రిషిక కన్నా హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకి దర్శకుడు గా ప్రదీప్ అట్లూరి వ్యవహరించారు. ఇకపోతే ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచన ఎలా ఉంది అనే విషయాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు చెబుతున్నాడు. ఇకపోతే ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఈ సినిమా హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 ఈ క్రమంలోనే యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు నవ్వుతూనే సమాధానం చెప్పిన హీరో హీరోయిన్లు ఇక ఒక్క ప్రశ్నకు మాత్రం కోపంతో ఊగిపోయారు.. సినిమా పేరు వర్జిన్ స్టోరీ అనే బోల్డ్ టైటిల్ అయ్యేసరికి.. ఇక యాంకర్ కూడా మీ ఇద్దరిలో వర్జిన్ ఎవరు   అంటూ అడిగేసాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక హీరోయిన్ కి కోపం వచ్చి యాంకర్ ని తిడుతూ బయటికి వెళ్లి పోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది వారిని కాసేపటి వరకు బుజ్జగించి  మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా చూశాక ఇది పక్కా స్క్రిప్ట్ అని మాత్రం అనుకుంటున్నారు ప్రేక్షకులు. సినిమా ప్రమోషన్స్ లో ఇలాంటివి ఎన్ని చూడలేదు అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: