బోయపాటి, రామ్.. ఊర మాస్ కాంబినేషన్ ఫిక్స్ అయిందిగా...!

murali krishna
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ సూపర్ హిట్ అందుకున్న రామ్ ఆ తర్వాత కిషోర్ తిరుమల రెడ్ సినిమాతో మరోసారి అపజయాన్ని మూట కట్టుకున్నాడని అందరికి తెలుసు.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు రామ్.అయితే చాలా కాలం నుంచి బోయపాటి శ్రీనుతో కలిసి రామ్ సినిమా చేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. కానీ తాజాగా ఆ విషయం మీద రామ్ అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాలలోకి వెళితే 
 

అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకొని సూపర్ ఫామ్ లోకి వచ్చాడు బోయపాటి శ్రీను. అఖండ సినిమా విజయంతో ఆయనకు వరుస సినిమా అవకాశాలు ఆయనకు వస్తున్నాయని ప్రచారం జరుగుతూ రాగా బాలకృష్ణ తో మళ్ళీ ఓ సినిమా చేస్తారని ఒకసారి అలాగే అల్లు అర్జున్ తో సినిమా చేస్తారని మరోసారి అలాగే రామ్ తో ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయట 

అయితే రామ్ ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశాలు లేవని ఆయనతో సినిమా చేయడం కష్టమేనని ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారాలు అన్నింటికీ క్లారిటీ ఇచ్చేలా రామ్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడట.. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా రామ్ పోతినేని 20వ సినిమా కాగా బోయపాటి శ్రీనుకు మాత్రం ఇది పదవ సినిమా అని ఈ సినిమాను కూడా రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించనున్నారట . శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కబోతోందని నిజానికి అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను ఇతర బాషల ప్రేక్షకులలో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించాడట.
 
తమిళంలో ఏకంగా అఖండ సినిమాను డబ్బింగ్ చెప్పించి విడుదల చేయగా ఆ సినిమా తమిళనాడు మరియు కేరళలో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో బోయపాటితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలి అని భావించిన నిర్మాత రామ్ తో కలిసి ఆ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కిస్తున్నరు అన్నమాట. ఇక ఈ విషయాన్ని రామ్ అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటిస్తూ మా 20వ సినిమాని ప్రకటించడం చాలా కిక్కిస్తోందిగా మాస్ ఎమోషన్స్ కి డాడీ లాంటి బోయపాటి శ్రీను కళ్ళలో నన్ను నేను చూసుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

 
రామ్ ప్రస్తుతానికి లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది అలాగే సినిమాలో రామ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తుండడం సినిమా మీద అంచనాలు కూడా పెంచేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ చూస్తే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ ను దర్శకుడు లింగుస్వామి చూపించారట.తొలిసారి రామ్ పోలీస్ రోల్ చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: