బాలయ్య బాబు(Balakrishna) ఫుల్
జోష్ మీద ఉన్నాడుగా. అఖండ
సక్సెస్ తో స్పీడ్ పెంచాడు బాలకృష్ణ.కొన్నాళ్లు ఈ
సక్సెస్ ను ఎంజాయ్ చేసిన బాలయ్ఇప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేశాడుగా.
నట సింహం బాలకృష్ణదూకుడికి
ఇండస్ట్రీ శేక్ అవుతుందట.. తగ్గేదే లే అన్నట్టు దూసుకుపోతున్నాడుగా
బాలయ్య బాబు. రీసెంట్ గా అఖండతో సూపర్
సక్సెస్ కొట్టిన బాలకృష్ణ(Balakrishna). ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టాడట.. వరుసగా కథలు కమిట్ అవుతూ.. ఒకదాని వెంట మరొకటి చేసుకుంటూ పోతున్నాడట బాలయ్య.
గతంలో కమిట్ అయిన మలినేని గోపీచంద్
సినిమా షూటింగ్ ను షురూ చేశాడట బాలకృష్ణ. ఈరోజు (ఫిబ్రవరి 18)
సిరిసిల్ల పరిసర ప్రాంతంలో
బాలయ్య సినిమా షూటింగ్ మొదలయ్యింది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ లతో రంగంలోకి దిగినట్టు సమాచారం .
బాలకృష్ణ సినిమా అంటేనే మాస్.. యాక్షన్ సీక్వెన్స్ లు.. భారీ డైలాగ్స్ తో
వెండి తెర బాగా వణికి పోతుంది. ఇక ఇప్పుడు అంతకు మించి అన్నట్టు యాక్షన్ చూపించడాని రెడీ అవుతున్నాడట నట సింహం.
రాయలసీమ ప్రాంతం వేట పాలెం నేపధ్యంలో ఈ
సినిమా కథ నడుస్తుందని అయితే ఈ సినిమాకు వేటపాలెం, పెద్దాయన లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట..
శృతి హాసన్ హిరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీకి స్టార్ మ్యూజిక్
డైరెక్టర్ అయిన
తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ మిళితంగా
సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం..
మలినేని గోపీచంద్ తో ఈ
సినిమా కంప్లీట్ అయిన తరువాత
అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య(Balakrishna) జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తరువాత పూరీ జగన్నాథ్ తో కూడా బాలకృష్ణ(Balakrishna)
సినిమా ఉన్నట్టు సమాచారం.. మరికొంత మంది డైరెక్టర్లు బాలకృష్ణ(Balakrishna) కోసం క్యూలో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలు చేస్తూనే.. వరుసగా కథలు వింటున్నారట స్టార్ సీనియర్ హీరో.
మరో వైపు బాలయ్య(Balakrishna) దూకుడుకు వెండితెరతో పాటు బుల్లి తెర కూడా ఎంతో అదిరిపోయింది. మొదటి తెలుగు ఓటీటీ యాప్ ఆహా కోసం అన్ స్టాపబుల్ అంటూ స్పెషల్ టాక్ షో చేశారు మన బాలకృష్ణ(Balakrishna). స్టార్
సూపర్ స్టార్ గెస్ట్ లతో ఫస్ట్ సీజన్ ను
సక్సెస్ ఫుల్ గా దానిని కంప్లీట్ చేశారు. ఇక రెండో సీజన్ కోసం ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాల హడావిడి అయిపోయిన్ తరువాత సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట .