కూలోడు లేకపోతే ధనవంతుడు లేడు అంటూ వారిపై వర్మ సెటైరికల్ కామెంట్స్..!!

Divya
వర్మ అంటే సినీ ఇండస్ట్రీలో కాస్త డిఫరెంట్ పేరు అని చెప్పవచ్చు.. తన కెరియర్ మొదట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు వర్మ. ఇక ఎన్నో సినిమాలు తీయడానికి తెలుగు నటులే కాకుండా ఇతర బాషలలోని నటులు సైతం పోటీ పడుతూ ఉండేవారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా వర్మ ఎక్కువగా అడల్ట్ మూవీస్, అడల్ట్ కామెంట్ల పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు.. ఇక సినీ ఇండస్ట్రీలో ఎటువంటి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తూ ఉంటాడు వర్మ. సినీ ఇండస్ట్రీలో వివాదాలను సైతం వేలెత్తి చూపిస్తూ ఉంటాడు వర్మ.. ఇలాంటి వర్మ ఇప్పుడు తాజాగా ఒక కొటేషన్ పెడుతూ అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది.. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


వర్మ ఏ విషయం తెలియజేసిన ఆ విషయం గురించి నలుగురు మాట్లాడుకునేలా చేస్తూ ఉండేలా చేస్తాడు అని చెప్పవచ్చు.. అది సినిమా అయినా సరే ,తను చేసే ట్వీట్ అయిన సరే, స్పీచ్ ఐనా సరే తనదైన శైలిలో స్పందిస్తూ నిరంతరము వార్తలు లోనే ఉంటూ ఉంటారు. వర్మ తాజాగా తన ట్విట్టర్ నుంచి ఒక కొటేషన్ ని షేర్ చేయడం జరిగింది.. ప్రతిసారి కష్టపడే వాడు కూలివాడు అవుతాడు.. అసలేం కష్టపడకుండా ఆ కూలి అతనితో తక్కువ డబ్బులు కి పని చేయించుకుని వాడు మాత్రం ధనికుడు అవుతాడు అంటూ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది.


ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ గా మారుతోంది. ఇక వర్మ చేసిన ఈ కొటేషన్ పై.. నెటిజన్లు కూడా తిరిగి కౌంటర్లు ఇవ్వడం జరుగుతోంది.. మరికొందరు ఏకంగా  కూలి వాళ్ళు లేకుండా ధనవంతుడు ఎవరు కాలేరని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. దీంతో ఇది కాస్త మరొకసారి వర్మనే చిక్కుల్లో పడేసిందని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: