తీవ్ర విమర్శల పాలవుతున్న బాలీవుడ్ బ్యూటీ..!

NAGARJUNA NAKKA
కంగన రనౌత్‌కి బాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్‌ ఉంది. ఎలాంటి క్యారెక్టర్‌ అయినా హండ్రెడ్‌ పర్సంట్‌ బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇస్తుందని అంటుంటారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం కంగనకి విచిత్రమైన ఫాలోయింగ్‌ ఉంది. కంగన ఏం మాట్లాడినా నెటిజన్స్‌ నుంచి విమర్శలు వస్తుంటాయి. ఘోరంగా ట్రోల్‌ చేస్తుంటారు. రీసెంట్‌గా దీపిక పదుకొణే గురించి మాట్లాడి మళ్లీ విమర్శల్లో పడింది కంగన.

దీపిక పదుకొణే, అనన్యా పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా లీడ్‌ రోల్స్‌లో వచ్చిన సినిమా 'గెహరాయియా'. ఇందులో దీపిక బోల్డ్‌ రోల్‌ గురించి బోల్డన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీ బయటా లోపలా అందరూ దీపిక యాక్టింగ్‌ గురించే మాట్లాడుతున్నారు. కంగన రనౌత్‌ కూడా రియాక్ట్ అయ్యింది. బ్యాడ్‌ మూవీస్‌ ఎప్పటికీ బ్యాడ్‌ మూవీసే. స్కిన్‌ షో, అడల్డ్‌ సీన్స్‌ ఉన్నంత మాత్రాన సినిమా ఆడదు. ఇది గెహరాయియా బాత్‌ కాదు అని ఒక పోస్ట్‌ పెట్టింది. 'గెహరాయియా' ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి దీపిక పదుకొణే లుక్‌ గురించి కామెంట్స్‌ వస్తూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత దీపిక మరీ ఇంత బోల్డ్‌గా యాక్ట్‌ చేయడమేంటి, రణ్‌వీర్ సింగ్‌ రియాక్షన్ ఏంటని మాట్లాడుతూనే ఉన్నారు. దీపికతో కలిసి రణ్‌వీర్ 'డూబే డూబే' సాంగ్‌ని ఎంజాయ్‌ చేస్తూ వీడియో పోస్ట్‌ చేసినా కామెంట్స్‌ మాత్రం ఆగలేదు. లేటెస్ట్‌గా కంగన రనౌత్‌ కూడా దీపికని టార్గెట్‌ చేసి మళ్లీ నెటిజన్లకి దొరికిపోయింది. స్ప్లిట్‌ పర్సనాలిటీ గురించి 'అపరిచితుడు' సినిమాలో చూశాం. ఈ సినిమా సౌత్‌లో సూపర్ హిట్‌ అయింది. ఇదే కథని బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నాడు రణ్‌వీర్ సింగ్. అయితే ఈ సినిమా రణ్‌వీర్‌ కంటే కంగన రనౌత్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది అంటున్నారు నెటిజన్లు. కంగన ఓల్డ్‌ స్టోరీస్‌ని బయటకు తీసుకొచ్చి, కంగనని ట్రోల్ చేస్తున్నారు. కంగన రనౌత్‌ 'చపాక్' సినిమా సమయంలో కూడా దీపిక పదుకొణేని విమర్శించింది. 'చపాక్' ట్రైలర్‌ రిలీజ్ అయినప్పుడు దీపిక సూపర్‌ పెర్ఫామర్‌ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఢిల్లీ జెఎన్‌యు యూనివర్సిటీలో లెఫ్ట్, రైట్‌ వింగ్ స్టూడెంట్స్‌ మధ్య జరిగిన గొడవలో దీపిక ఒక వర్గానికి మద్దతిచ్చింది. ఆ తర్వాత వెంటనే దీపికని 'చపాక్' సినిమాని విమర్శించింది కంగన.

కంగన రనౌత్‌ కెరీర్‌ బిగినింగ్‌లో మహేశ్‌ భట్‌ లేకపోతే నా కెరీర్‌ లేదు అన్నట్లుగా మాట్లాడింది. అయితే ఈ మధ్య కాలంలో మహేశ్‌ భట్‌ అంటేనే విరుచుకుపడుతోంది. నెపోటిజాన్ని ప్రోత్సాహిస్తున్నాడని, కూతుళ్లు పూజా భట్, ఆలియా భట్‌ని హీరోయిన్స్‌ని చేశాడని, గ్రూపు రాజకీయాలకి నాయకుడని తిట్టింది.కంగన రనౌత్‌ కెరీర్‌ బిగినింగ్‌లో బోల్డ్ రోల్స్‌ చేసింది. స్కిన్‌ షోకి అడ్డు చెప్పలేదు. అదంతా యాక్టింగ్‌లో భాగం అని చెప్పింది. అదే మిగతా హీరోయిన్లు రొమాంటిక్‌ సీన్స్‌ చేస్తే గ్లామర్‌తో డబ్బు సంపాదించాలనుకుంటున్నారని మాట్లాడుతోంది. దీంతో కంగనకి సినిమాలు, సినిమా ఇండస్ట్రీ గురించి చాలా బాగా తెలుసు. కానీ ఆమెకి నచ్చని హీరోయిన్‌ అయితే పాయింట్‌ లేకుండా విమర్శిస్తుంది. ఇష్టం వచ్చినట్లు స్టేట్ మెంట్స్ ఇస్తుందని విమర్శిస్తున్నారు జనాలు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: