ఆ దర్శకుడు అన్న మాటలకు ఒళ్ళు మండిందంటున్న తాప్సీ...!!

murali krishna
సొట్ట బుగ్గల సుందరి అయిన తాప్సీ తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో ఆమె పరిచయం అయింది. తొలి సినిమాతోనే తన అందం మరియు అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కి వెళ్లిందట.అక్కడ నుండి బాలీవుడ్‌కి కూడా చెక్కేసింది. అక్కడ కూడా వరుస అవకాశాలను ఆమె సొంతం చేసుకుంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్ ని సొంతం చేసుకుంది. గ్లామర్‌ కంటే నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును ఆమె సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగుతున్న తాప్సీ వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ భారీ ప్రేక్షకదారణ పొందుతుంది.

వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు తాప్సీ. మరోవైపు.. హీరోయిన్‏గా చేస్తూనే కూడా ప్రొడ్యూసర్‏గానూ మారి తన చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ఆమె నటించిన స్పోర్ట్స్‌ డ్రామా 'రష్మీ రాకేట్‌' చిత్రంకోసం తాప్సీచాలా కష్టపడిందట.ప్రతి సినిమా కోసం తన పూర్తి కష్టం పెడుతుంటుంది. తాజాగా తాప్సి నటించిన చిత్రం ‘లూప్ లపేట’. ఇది 1998లో తెరకెక్కిన జర్మన్ మూవీ ‘రన్ లోలా రన్’ అనే చిత్రానికి రీమేక్ అని ఈ చిత్ర షూటింగ్ సమయంలో తాప్సి ఓ చేదు అనుభవం ఎదుర్కొందట.ఇందులో ముద్దు సన్నివేశం ఉండగా అందులో జీవించేందుకు డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ అందించారట..



తాప్సి మరియు నటుడు తాహిర్ మధ్య రొమాంటిక్ లిప్ లాక్ సన్నివేశం సమయంలో మీ చేతులని ఒకరినొకరు బాగా హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ముద్దు పెట్టుకోండి. ఆ ముద్దు ఎలా ఉండాలంటే ఒకరికొకరు స్విచ్ ఆన్ చేసినట్లుగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడట మధ్యలో ఆకాష్ కామెంట్స్ శృతి మించాయని తాహిర్ ఇలాంటి అమ్మాయిని ఇంతకు ముందెప్పుడూ నువ్వు చూడలేదు ఇలాంటి అమ్మాయితో ఇలాంటి ఛాన్స్ ఎప్పుడూ నీకు దక్కలేదు కిస్ చెయ్’ అంటూ అసభ్యంగా మాట్లాడాడట ఆ దర్శకుడు.అప్పుడు నాకు చిరాకు వచ్చి ఆపేశానని ఏం మాట్లాడుతున్నావ్ అంటూ గట్టిగా ప్రశ్నించానని అతని మాటలు నాకు చాలా బాధ కలిగించాయని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: