ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తికరంగా ఉన్న హీరోయిన్..!!
హీరోయిన్ మాళవిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మారుతి, ప్రభాస్ కలయికలో వస్తున్న చిత్రంలో ఈమె పేరు బాగా వినిపిస్తోందని సమాచారం.. ఇక ఈ సినిమా ఫుల్ కామెడీ, కమర్షియల్ సినిమాగా ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం. ఇక ఇదివరకే కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగులో కొంతమంది హీరోల సరసన నటించి బాగా పేరు సంపాదించింది. ఇక ప్రభాస్ తో మూవీ అంటే భారీ బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక అధికార ప్రకటన వెలువడనుంది అన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ మారుతి కూడా ఈ సినిమాకు సంబంధించి కొంతమంది నటీనటులతో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ మాళవిక కూడా ప్రభాస్ తో నటిస్తే చూడాలని ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ తో సినిమా కోసం మారుతి ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యిందంటే ప్రభాస్ బడా డైరెక్టర్ ల జోలికి వెళ్ళడు అనే వార్త బాగా వినిపిస్తోంది..