టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డింపుల్ హయాతి క్రేజ్ మామూలుగా లేదుగా..!

Pulgam Srinivas
ఎంతో మంది ముద్దుగుమ్మలు సినిమాలలో హీరోయిన్ గా నటించాలి అని ఎన్నో ప్రయత్నాలను చేస్తే ఉంటారు,  కొంతమందికి సినిమాలలో హీరోయిన్ అవకాశాలు కాకుండా ఇతర అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయి.  కానీ కొంతమంది కేవలం హీరోయిన్ పాత్రల కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారు,  కానీ మరి కొంత మంది మాత్రం అందిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ హీరోయిన్ స్థానానికి వస్తూ ఉంటారు,  ప్రస్తుతం డింపుల్ హయాతి కూడా అలా చిన్న స్థాయి నుండి మొదలు పెట్టి ప్రస్తుతం హీరోయిన్  స్థానం వరకు వచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ గద్దల కొండ గణేష్ సినిమాలో జర జర అనే స్పెషల్ సాంగ్ లో నటించింది,  ఈ సాంగ్ లో ఈ ముద్దుగుమ్మ అందచందాలకు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు, అలా ఈ సాంగ్ తో ఫుల్ క్రేజ్ ను డింపుల్ హయాతి కి  మాస్ మహారాజా రవితేజ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.


  కొన్ని రోజుల క్రితమే అనగా ఫిబ్రవరి 11 వ తేదీన ఈసినిమా థియేటర్ లలో విడుదలైంది, ఈ సినిమాలో డింపుల్ హయాతి నటనకు అంతకు మించిన హాట్ హాట్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు, మరీ ముఖ్యంగా ఈ సినిమాలో డింపుల్ హయాతి అందచందాలు ప్రదర్శించే విషయంలో ఏమాత్రం వెనకాడలేదు,  ఇలా అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో అవకాశం దక్కినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది,  అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కూడా డింపుల్ హయాతి ని హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర బృందం అనుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది,  ఒక వేళ ఈ వార్తలే కనుక నిజం అయితే డింపుల్ హయాతి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: