హీరో రామ్ కంటే ఎక్కువ తీసుకుంటున్న బోయపాటి...?

murali krishna
ఎనర్జిటిక్ స్టార్ అయిన రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నాడని టాలీవుడ్ టాక్ నడుస్తుంది.

రామ్ కోసం బోయపాటి హైవోల్టేజ్ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడని సమాచారం.ఈ డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చడంతో రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది ఓకే అయితే ఏప్రిల్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇందులో రామ్ డ్యూయల్ రోల్ చేస్తాడని మరియు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని సమాచారం.


మొత్తానికి రామ్‌ తో మూవీ ప్లాన్ చేస్తున్న బోయపాటి ? అంటూ ఈ వార్త అయితే తెగ హల్ చల్ చేస్తోంది. పైగా రామ్, ఎప్పటి నుండో మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని కూడా బాగా ఆశ పడుతున్నాడు. ఇప్పుడు యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం అయిన బోయపాటి శ్రీను మరియు రామ్ కోరికను తీర్చబోతున్నాడు. ఎలాగూ బోయపాటి 'అఖండ'తో అఖండమైన విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నాడుగా అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే...

దాంతో స్టార్ హీరోలు బోయపాటికి పిలిచి మరీ ఛాన్స్ లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట.అయితే, తన తర్వాత సినిమాని రామ్ తో తీస్తున్నాట బోయపాటి. కాగా ఈ చిత్రానికి హీరో రామ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న చిత్రానికి రామ్ రూ.9 కోట్లు తీసుకుంటే బోయపాటి మాత్రం రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత బోయపాటి అల్లు అర్జున్‌తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

మొత్తానికి బోయపాటికి హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు.అన్నట్టు బోయపాటి రామ్ కి ఒక కథ కూడా చెప్పాడు. ఆ కథతోనే గతంలో బన్నీతో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు మన బోయపాటి. మొత్తమ్మీద బన్నీ కథలో రామ్ హీరోగా చేయబోతున్నాడని తెలుస్తుంది ఇది విని బన్నీ సన్నిహితులు కూడా ఏమిటిది బోయపాటి ? అంటూ మెసేజ్ లు పెడుతున్నారట…!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: