సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు, ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు, ఈ సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి, ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా నుండి విడుదల చేసిన టైటిల్ సాంగ్ కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది, ఈ టైటిల్ సాంగ్ ద్వారా కూడా ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి, ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 12 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది, విడుదలైన మొదటి రోజు నుండే డిజే టిల్లు సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.
ఈ సినిమాను దర్శకుడు రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు, మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగినట్లు తెలుస్తోంది, ఈ సినిమాకు ఓవర్సీస్ లో కూడా 65 లక్షల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది, మొదటి రోజే ప్రీమియర్ షో లతో ఈ సినిమా 200 కే డాలర్ కలెక్షన్ లను అమెరికాలో చేసినట్లు తెలుస్తోంది తెలుస్తోంది. థియేటర్ లలో విడుదల అయిన డీజే టిల్లు మంచి టాక్ ను సంపాదించుకొని మంచి కలెక్షన్ లను రాబడుతోంది, ఈ సినిమా హక్కులను తెలుగు ప్రముఖ ఓటిటి సంస్థ అయిన ఆహా దక్కించుకున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమా థియేటర్ లలో నాలుగు వారాల రన్ తర్వాత ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్లు తెలుస్తోంది, ఇలా ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్ లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డీజే టిల్లు సినిమా నాలుగు వారాల తర్వాత ఓటిటి లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.