సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ గుర్తున్నారా..? ఇప్పుడేం చేస్తుందంటే..?

N.ANJI
చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు. పోతుంటారు.. ఇండస్ట్రీలో మంచి హీరోయిన్‌గా గుర్తింపు పొందేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అలనాటి స్టార్ హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో రాణించడానికి ఎంతో శ్రమించారు. అలా కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిన వారు ఉన్నారు.. ఏ కష్టం లేకుండా ఒక్క సినిమాతోనే పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సీతాకోకచిలుక హీరోయిన్‌ అరుణ ఒకరు. సీతాకోకచిలుక సినిమాతోనే ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న అరుణ ప్రస్తుతం ఎక్కడుంది..? ఇప్పుడేం చేస్తుందనే విషయాల గురించి ఒక్కసారి చూద్దామా.

అయితే హీరోయిన్ అరుణ అందం, అభినయం కలబోసిన అచ్చతెలుగు అమ్మాయి. ఆమె తొలి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు భారతీరాజా సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఇక 1981లో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ సంచలనం క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఈ మూవీలో పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా రాణిస్తున్నాయి. ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవడంతో ఒక్క రాత్రిలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది హీరోయిన్ అరుణ.

ఈ సినిమా విజయాన్ని అందుకోవడంతో తరువాత వరుస అవకాశాలను చేజిక్కించుకుంది. ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక అరుణ నటించిన ‘చంటబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ వంటి సినిమాలు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొంది.. ఆమె సినీ జీవితంలో హిట్‌ సినిమాలుగా నిలిచిపోయాయి. అంతేకాక..ఆమె ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోయిన్‌గా స్థానం సంపాదించిన అరుణ కేవలం 10 సంవత్సరాల్లోనే 70కి పైగా సినిమాల్లో నటించారు.

అరుణ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే బిజినెస్‌మెన్ మోహన్‌గుప్తను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఈ దంపతులకు నలుగురు సంతానం. అరుణ ఫ్యామిలి ప్రస్తుతం అమెరికాలో సెటిల్‌ అయ్యారు. అయితే అరుణ రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. ఇక అందులో వంటలు, హెల్తీ లైఫ్‌, వర్కవుట్స్‌ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విశేషాలను అభిమానులతో పంచుకుంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: