ఇండైరెక్టుగా స్టార్ హీరోయిన్ పై విరుచుకుపడుతున్న కంగనా.. కారణం..?

Divya
ఈ మధ్యకాలంలో కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ భామల లో మొదటి స్థానంలో కంగనా రనౌత్ ఉంటుంది. ఇక ఈమె స్టార్ హీరోయిన్ అయినా కూడా సౌత్ లో మోస్ట్ పాపులర్ స్టార్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఈమె సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు వివాదాలతో కూడా చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది.. తాజాగా ఈ అమ్మడు మరో విషయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం సంచలనంగా మారింది.. ఎప్పుడు స్టార్ హీరోయిన్స్ పై విమర్శలు చేస్తూ ఉండే కంగనా ఈసారి ఇండైరెక్టుగా దీపికా పదుకొనే పేరు ఎత్తకుండానే.. ఆమె నటించిన తాజా చిత్రం గెహ్రైయాన్ సినిమా పై తీవ్రంగా వ్యాఖ్యలు చేసి వివాదంగా మారింది..
ఇందులో హీరోయిన్ గా నటించిన దీపిక పదుకొనే సినిమా విడుదలైన తర్వాత నెగిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో.. కంగనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి.. ఈ సినిమాలో రొమాన్స్ బాగా ఎక్కువ అయ్యింది అని అయినా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయారు అని సమాచారం.. ఇకపోతే ఈ సినిమా ను ఉద్దేశించి కంగనారనౌత్ ఎలాంటి వ్యాఖ్యలు చేసిందని విషయానికొస్తే ఇన్స్టాగ్రామ్ ద్వారా... నేను కూడా ఈ జనరేషన్ కు చెందినటువంటి హీరోయిన్ నే.. కానీ నాకు ఈ తరహా శృంగార మాత్రం అర్థం కాలేదు.. న్యూ ఏజ్ సినిమాలు పేరుతో చెత్త సినిమాలను అమ్మకండి...
ముఖ్యంగా బూతు కంటెంట్ పోర్నోగ్రఫీ చెత్త సినిమాలను ఎప్పుడు కాపాడలేవు అనేది ఒక ప్రాథమిక సూత్రం అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. అంతేకాదు ఇలాంటి సినిమాలను తెరకెక్కించే వారికి తెలియదా అంటూ చేసిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది.. కంగనా రనౌత్ అభిమానులు మాత్రం డైరెక్ట్ గా ఆమె పోస్టుకు దీపికా పదుకొనే పేరు పెట్టి షేర్ చేస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం తప్పు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: