అల్లు అర్జున్ మరియు రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్సాఫీస్‌ని బాగా షేక్ చేసింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో పాటు పలు రాష్ట్రాలలో ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్స్ అన్నీ ఇన్నీ కావట.
గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా రీసెంట్‌గా 50 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ మేకోవర్ అయిన తీరును చూసి అందరు కూడా ఆశ్యర్య పోయారు.
ఇక 'పుష్ప' సినిమా 50 రోజుల్లో రూ. 365 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు. ఏపీలో మాత్రం ఫ్లాప్‌గా నిలిచిన 'పుష్ప' మిగతా ప్యాన్ ఇండియా లెవల్లో అయితే సత్తా చాటాడు. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించిందట.ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోందట.పుష్ప హిందీ వెర్షన్ మంచి వసూళ్లనే దక్కించుకుందని తెలుస్తుంది.
నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారట.ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోందట పుష్ప. మొత్తంగా హిందీలో 50రోజుల్లో.. రూ. 47.73 కోట్ల షేర్ (రూ. 100 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించిందని తెలుస్తుంది.
సినిమాలోని డైలాగులు మరియు పాటలు అన్నీ కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో పుష్ప క్యారెక్టర్‌ను అనుకరిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ప్రత్యేక వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. సినిమా పేరుతో చిప్స్ ప్యాకెట్స్ అలాగే సూరత్‌లోని చరణ్‌జీత్ క్లాత్ మార్కెట్ ప్రస్తుతం ఈ క్లాత్ మార్కెట్ పుష్ప సినిమా పోస్టర్లతో చీరలు రూపొందించిందన విషయం తెలిసిందే.పుష్ప సినిమా పాపులర్ అవ్వడంతో ఈ సినిమాతో ప్రత్యేకంగా చీరలు రూపొందించాలని ఈ కంపెనీ యజమాని చరణ్‌పాల్ అనుకున్నాడు.
ఇక తాజాగా ఫిజియోథెరపీ క్లినిక్ పుష్పని ప్రమోషన్ కోసం బాగా వాడుకుంటుంది. ట్రీట్‌మెంట్ ముందు ఇలా తర్వాత ఇలా అంటూ పుష్పలో బన్నీ లుక్స్‌తో తెగ మార్కెటింగ్ చేస్తున్నారట.. వారి ఆలోచనకు కొందరు నెటిజన్స్ హ్యాట్సాఫ్ కూడా అంటున్నారు. ఏదేమైన పుష్స హంగామా ఇప్పట్లో తగ్గేదే లే అనిపిస్తుందట.