పోలీస్ గా మారిన రష్మి.. సుధీర్ ను ఇంటరాగేషన్ ?

praveen
యాంకర్ రష్మి సుడిగాలి సుధీర్ ఈ పేరు చెబితే చాలు బుల్లితెర ప్రేక్షకులందరికీ ముఖంలో నవ్వు కనిపిస్తోంది. ఎందుకంటే అంతలా ఈ జంట బుల్లితెర ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుంది. జబర్దస్త్ లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఇక ఇప్పుడు బుల్లితెర మొత్తం పాకి పోయింది. అయితే కేవలం ఈటీవీ లో మాత్రమే కాదు ఈ ఇద్దరు కలిసి ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు మురిసిపోతూ ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటుంది.



 ఇక సుడిగాలి సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలని కోట్ల మంది అభిమానుల ఆశ పడుతున్నారు అని చెప్పాలి. అయితే తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఇద్దరు చెబుతూ ఉంటారు. వీరిద్దరూ ఎంత చెప్పినా రష్మీ సుధీర్ మధ్య ఉంది లవ్ అంటూ అందరూ ఫిక్స్ అయి  పోయారు. రష్మీ అప్పుడప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్  లో సుడిగాలి సుదీర్ స్కిట్ లో కామెడీ చేస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే పోలీస్ అవతారం ఎత్తింది యాంకర్ రష్మి.



 ఇక గొలుసుల తో కట్టేసి ఖైదీగా ఉన్న సుడిగాలి సుధీర్ ను ఇంటరాగేషన్ చేసింది. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. ప్రోమో ఎప్పటిలాగానే ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తుంది అనే చెప్పాలి. ఇందులో భాగంగా సుడిగాలి సుదీర్ సంకెళ్లు  వేసుకుని స్టేజ్ మీదకి వస్తాడు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన రష్మి  ఇంటరాగేషన్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. ఈ సమయం లోనే సుదీర్ చెప్పే సమాధానాలు అక్కడున్న వారందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నాయి అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రోమో పై లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: