దూసుకుపోతున్న అజిత్ 'వలిమై' తెలుగు సినిమా ట్రైలర్..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  అజిత్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించాయి.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ నటించిన వలిమై సినిమా కూడా తెలుగులో విడుదల కాబోతుంది,  ఇదివరకే ఈ సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  కాకపోతే కారోనా విజృంభించడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా తెలియజేసింది, ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో వలిమై చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది.


 అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది,  యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యతనిస్తూ వదిలిన  ఈ సినిమా ట్రైలర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.  అనువాద చిత్రమైనప్పటికీ వలిమై సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది, ఈ ట్రైలర్ ద్వారా ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.  ఈ మూవీలో  అజిత్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు, ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు,  కార్తికేయ ఈ సినిమాలో ఒక దోపిడీ ముఠాకి నాయకుడిగా కనిపించబోతున్నాడు.  హుమా ఖురేషి కథానాయికగా నటించిన  ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు, ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: