అడ్వాన్స్ బుకింగ్ తో దూసుకుపోతున్న డీజే టిల్లు..!!
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పాటలు విడుదల కాక ప్రేక్షకులను బాగానే అలరించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా డీజే టిల్లు అనే పాట ఎక్కడ చేసిన బాగా వినిపిస్తూనే ఉంది. ఇక ఈ సినిమా అనుకున్న స్థాయి కంటే ఎక్కువ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 400 థియేటర్లలో వరకు విడుదల అవుతోందట. ఇక ప్రపంచ వ్యాప్తంగా 640 స్క్రీన్లలో విడుదల అయ్యింది డీజే టిల్లు సినిమా. ఇక చిన్న సినిమా అయినప్పటికీ థియేటర్లు ఈరోజుల్లో దొరకడం అంటే అది కేవలం సితార బ్యానర్ సపోర్ట్ గా చెప్పవచ్చు.. ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ మూడు రోజుల ముందు నుంచి మంచి అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలలోని థియేటర్లు హౌస్ ఫుల్ బుకింగ్ నెలకొన్నాయి. దీన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాలలో డీజే టిల్లు మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మూవీ ఫస్ట్ టాక్ బాగుండి..యువతను బాగా ఆకర్షించినట్లుయితే ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నిటిని జొన్నలగడ్డ సిద్ధునే రాసుకున్నాడట. దీంతో ఈ యువ హీరో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.