ఒకప్పుడు తెలుగు హీరోలు అయితే
బాలీవుడ్ లో అడుగుపెట్టాలంటే సవాలక్ష సవాళ్లు నార్త్
ఆడియన్స్ ని మనం ఆకట్టుకోగలమా..బాలీవుడ్ మాఫియా సహకారం మనకు అందిస్తుందా.. అసలు కనీసం తెలుగు సినిమాకి థియేటర్లు ఇస్తారా అన్న భయంతో ఉండేవారట.. అయితే
బాహుబలి తరువాత ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయని తెలుస్తుంది.. ఒక తెలుగు
సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని బద్దలు కొడుతూ 1500కోట్ల కలెక్షన్స్ సాధించిందట..
బాహుబలి ఇచ్చిన ఈ ధైర్యంతో ఇక వరుసగా మన హీరోలు పాన్
ఇండియా సినిమాలు చేస్తూ
బాలీవుడ్ హీరోలకి సవాల్ విసురుతున్నారని తెలుస్తుంది.. మనల్ని పట్టించుకొని పరిస్థితుల నుండి మన హీరోలు, దర్శకుల వెనుక
బాలీవుడ్ మేకర్స్ పడే స్థాయికి తెలుగు
సినిమా ఎదిగిందట.. దాంతో ఇప్పుడు
బాలీవుడ్ స్టార్స్ అంతా
టాలీవుడ్ హీరోల జపం చేస్తున్నారని తెలుస్తుంది.మన తెలుగు హీరోలని పొగుడితే వారి సినిమాలకి ఇక్కడ కలెక్షన్స్ వస్తాయనో.. లేక మన హీరోలతో నటిస్తూ సౌత్
మార్కెట్ ని పెంచుకోవాలన్న ప్లానో ఏమో కానీ.. బడా బడా
బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఇప్పుడు
టాలీవుడ్ వైపు చూస్తున్నారని సమాచారం.
తాజాగా
బాలీవుడ్ స్టార్
హీరోయిన్ అయిన దీపికా పదుకునే..
అల్లు అర్జున్ మరియు
ఎన్టీఆర్ లపై తన ప్రేమని చూపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేసిందట..
దీపికా పదుకునే మరియు
అనన్య పాండే కలిసి చేసిన 'గెహ్రాయాన్'
సినిమా ఈ రోజు
ఫిబ్రవరి 11న
అమెజాన్ లో రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే.. ఈ
మూవీ ప్రమోషన్ లో భాగంగా దీపికా మీడియాతో ముచ్చటించిందట.ఈ క్రమంలో బీ టౌన్ విలేకరి ప్రశ్న అడుగుతూ.. ఇప్పటి వరకు మీరు నటించిన వారు కాకుండా నటించని స్టార్స్ లో ఎవరితో మీరు నటించాలని అనుకుంటున్నారు అంటూ దీపికను ప్రశ్నించారట., దీపికా మాట్లాడుతూ..
తారక్ తో కలిసి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని
ఎన్టీఆర్ తో నటించడానికి సమయం ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని అలాగే
అల్లు అర్జున్ తో కూడా నటించాలి అనుకుంటున్నాను." అని తెలిపిందట.. అలాగే ప్రస్తుతం
దీపికా పదుకునే ప్రభాస్ తో కలిసి 'ప్రాజెక్ట్ K'లో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ
సినిమా గురించి చెప్తూ
ప్రభాస్ తో నటించడం చాలా బాగుందని
ప్రభాస్ మంచి కోస్టార్ అని ఆమె తెలిపింది. ఇక
బాలీవుడ్ స్టార్స్ పేర్లు చెప్పకుండా
ఎన్టీఆర్,
అల్లు అర్జున్ పేర్లు చెప్పడంతో ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్స్ మన హీరోలతో కలిసి నటించడానికి తెగ ఇష్టపడుతున్నారు అంటే మన స్టార్స్ పాన్
ఇండియా వైడ్ ఎంత రేంజ్ కి ఎదిగారో మనకు తెలిసిపోతుంది.