టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు అంతా ఇంతా కాదు.ఇక అలాగే తమిళంలో హీరో దళపతి విజయ్ కు కూడా ఇదే స్థాయిలో క్రేజ్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది.తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తుండగా తమిళంలో విజయ్ బీస్ట్ అనే సినిమా సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీగా అంచనాలు అనేవి నెలకొన్నాయి. నెల రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లలో విడుదల అయ్యి సందడి చెయ్యనున్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు, దళపతి విజయ్ మధ్య మంచి స్నేహం ఉందనే సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కి హిట్టైన పలు సినిమాలను తమిళంలో విజయ్ రీమేక్ చేసి ఆ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకొని పెద్ద స్టార్ హీరో అయ్యాడు.
ఇక ఈ ఇద్దరు హీరోలలో క్రేజ్ విషయంలో ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేయలేము. సూపర్ స్టార్ మహేష్ తర్వాత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా విజయ్ నటించిన బీస్ట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.ఇక అసలు విషయానికి వస్తే వీరిద్దరి తాజా సినిమాల్లోని ఫస్ట్ సాంగ్స్ ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల అవుతుండగా ఆల్రెడీ వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇక అలాగే మహేష్ నిన్న అజిత్ వాలిమై తెలుగు ట్రైలర్ ని తన చేతుల మీదుగా రిలీజ్ చేసి అజిత్ కి సపోర్ట్ ఇచ్చాడు. దీని వల్ల అజిత్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాని విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో హర్ట్ అయ్యి మహేష్ ఫ్యాన్స్ తో వార్ ఇంకా పెంచుకుంటున్నారు. మహేష్ ఫ్యాన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా యుద్దానికి సై అంటున్నారు.