బాలీవుడ్ నటి తండ్రి మృతి..
'మీరెప్పుడు కూడా నాతోనే ఉంటారు. నేను కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. ఐ లవ్ యు నాన్న' అని భావోద్వేగ కామెంట్ తో ఈ పోస్టు రాసుకొచ్చింది.ఇక రవి టాండన్ అకాల మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రవీనా అభిమానులు ఇంకా సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా ఆమెకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. రవీనా సన్నిహితులు ఇంకా బాలీవుడ్ మీడియా వర్గాల వారు కూడా ఆయన మరణానికి గాను వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.ఇక రవీనా టాండన్ సినిమాల విషయానికి వస్తే ఆమె త్వరలోనే రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న కన్నడ ఇండస్ట్రీ హిట్ పాన్ ఇండియా సినిమా 'కేజీఎఫ్' కి సీక్వెల్ అయిన 'కేజీఎఫ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా అలాగే ప్రస్తుతం ఆమె పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.