రామ్ చరణ్ బర్త్డే కి ఉపాసన సర్ప్రైజ్... ?

VAMSI
చిన్ననాటి స్నేహితులైన రామ్‌చరణ్‌, ఉపాసనలు వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి 2012లో జరిగింది. అంటే ఇప్పటికి దాదాపుగా పదేళ్ల నుండి తమ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాగా ఇప్పటికీ వీరికి పిల్లలు పుట్టకపోవడం అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఈ విషయాన్ని పక్కన పెడితే చెర్రీ , ఉపాసనలు ఎంతో  సంతోషంగా, అన్యోన్యంగా ఉంటారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ కు ఒక వారసురాలు, మరో వైపు మెగా ఇంటి కోడలు అయినప్పటికీ ఎంతో సాదా సీదాగా తన జీవితాన్ని గడిపే వ్యక్తి. ఉపాసనకు భర్త చెర్రీ అంటే ప్రాణం. వారి క్యూట్ మూమెంట్స్ పిక్స్ ను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తన ఆనందాన్ని పంచుకుంటారు ఉపాసన.

కాగా వచ్చే నెల అనగా మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్ డే అన్న విషయం అందరికి తెలిసిందే. తన భర్త పుట్టిన రోజు గిఫ్ట్ గా ఒక బడా సర్ప్రైజ్ ను ఉపాసన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది తనకి ఉపయోగపడదు కానీ చెర్రీకి దిల్ ఖుషీ అయ్యే వార్త అట. ఇంతకీ అదేమిటి అంటే భర్త చెర్రీ పుట్టినరోజు పురస్కరించుకుని తన అపోలో హాస్పిటల్ లో కొందరి చిన్నారుల పేషంట్స్ కు ట్రీట్ మెంట్ ఫ్రీగా జరిపించాలని అనుకుంటున్నారట ఉపాసన. అయితే ఎవరైతే ఆర్దిక స్థోమత లేక  తమ పిల్లల వైద్య సహాయం కోసం ఎదురుచూస్తుంటారో అలాంటి వారికి ఈ సాయం అందేలా చూడాలని ఉపాసన కొణిదెల యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను తన స్టాఫ్ కు ఇచ్చినట్లు సమాచారం. ఇది నిజంగా మెగా అభిమానులు సంబరాలు జరుపుకునే వార్త అని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ వార్త గురించి ఇది ఒక గాసిప్ గానే ఉంది. ఇంకా సమయం ఉన్నందున కొన్ని రోజులలో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: