రేపటి వేళ
సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందించిన
డీజే టిల్లు రేపు (శనివారం,11.02.2022) విడుదలకు సిద్ధం అవుతోంది.సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు
శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా,తమన్ నేపథ్య సంగీతం అందిస్తుండడం విశేషం.విమల్
కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఇప్పటికే విడుదలయిన టీజర్,ట్రైలర్ మంచి టాక్ తెచ్చుకోగా
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే ఉంది. అర్బన్ ఏరియాల్లోనే కాదు రూరల్ ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ చేస్తుందని సమాచారం.హీరోయిన్ నేహాశెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణ.
అదేవిధంగా ఈ
సినిమా టైటిల్ సాంగ్ కు విపరీతం అయిన టాక్ వస్తోంది.ఇప్పటికీ ఇది చాట్ బస్టర్ గానే ఉంది.కాసర్ల
శ్యామ్ ఈ పాట రాయగా,రామ్ మిరియాల పాడారు.ఈ ఎనర్జిటిక్ సాంగ్
మాస్ నంబర్ గా మంచి స్థాయిలో ఉంది.18,645,994 వ్యూస్ తెచ్చుకుని ఇప్పటికీ నెట్టింట దూసుకుపోతూనే ఉంది.బిజినెస్ పరంగారవితేజ ఖిలాడికి కొన్ని ఏరియాల్లో గట్టిపోటీనే ఇచ్చింది.ఎలా చూసుకున్నా ఓ విధంగా ఇది త్రివిక్రమ్ నిర్మించిన సినిమానే.సూర్య దేవర
నాగ వంశీ నిర్మాతగా ఉన్నారు.ఆయన
తండ్రి చినబాబు హారికా-హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత.ఓ విధంగా ఇది త్రివిక్రమ్ సొంత బ్యానర్.ఆ విధంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా నిర్మాతగా చినబాబు, మరో నిర్మాతగా అనధికార హోదాలో ఎప్పటి నుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. మరి! ఈ
సినిమా నిర్మాతలకు ఏ మేరకు కలిసివస్తుందో కూడా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా రూ.8.95 కోట్ల మేరకు ప్రీరిలీజ్ బిజినెస్ అయిందని తెలుస్తోంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర 9.5 కోట్ల రూపాయలు రాబడితేనే నిర్మాతలు సేఫ్ అని బాక్సాఫీసు సమాచారం.
నైజాంలో 135 థియేటర్స్లో
సీడెడ్ లో 70 థియేటర్స్లో
ఆంధ్ర రీజన్ లో 180 థియేటర్స్లో
రెండు తెలుగు రాష్ట్రాలలో 390 వరకు థియేటర్లలో
రిలీజు అవుతున్న ఈ సినిమా నిర్మాతలకూ,దర్శకులకూ ఆల్ ద బెస్ట్.