టాలీవుడ్ హీరో సుమంత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, సుమంత్ 'సత్యం' సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కాని ఈ సినిమా తర్వాత ఆ రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక డీలా పడిపోయాడు, కొన్ని రోజుల క్రితం విడుదలైన మళ్ళీరావా సినిమాతో సుమంత్ ఫామ్లోకి వచ్చాడు. ప్రస్తుతం సుమంత్ మళ్ళీ మొదలైంది సినిమాలో నటించాడు, ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీ నుండి జీ ఫైవ్ ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది, ఇది ఇలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో సుమంత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, సుమంత్ రియల్ లైఫ్ లో మామ అల్లుడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే, వీరిద్దరూ కలిసి బాలశేఖరన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహమంటే ఇదేరా సినిమాలో ఫ్రెండ్స్ ల నటించారు.
ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది, మలయాళంలో మంచి విజయం సాధించిన ఫ్రెండ్స్ అనే సినిమాను తెలుగులో స్నేహమంటే ఇదేరా పేరుతో రీమేక్ చేశారు. నిజ జీవితంలో మామ అల్లుళ్ల ను దర్శకుడు ఫ్రెండ్స్ లా చూపించడం వల్ల ఈ సినిమా ప్లాప్ అయింది అంటూ సుమంత్ కామెంట్ చేశారు, ఒకానొక సందర్భంలో సుమంత్ ఈ మూవీ లో నటించి తప్పు చేశాను అని తెలియజేశాడు. అది మాత్రమే కాకుండా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసు అని సినిమా కూడా సుమంత్ తెలియజేశాడు, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సినిమా చేసి తప్పు చేశాను అని అనుకున్నాను, కాకపోతే అప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి అవడంతో ఏమి చెయ్యాలో అర్ధం కాక అలాగే సినిమా కంటిన్యూ చేశాను అని సుమంత్ తెలియజేశాడు, ఈ మూవీ ద్వారా నిర్మాతలు కూడా చాలా నష్టపోయారు అని ఈ సందర్భంగా సుమంత్ చెప్పుకొచ్చాడు. స్నేహమంటే ఇదేరా సినిమాలో భూమిక హీరోయిన్ పాత్రలో నటించగా ప్రత్యూష మరో ముఖ్యమైన పాత్రలో నటించింది.