ఏపీ లో సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించడం విషయం పై ఇప్పటికే చర్చలు దుమారం రేపుథున్న సంగతి తెలిసిందే.. ఎపిలో సినిమా టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నా కూడా సినిమాలను అనుకున్న సమయం లో సినిమాలను విడుదల చేసి వచ్చిన దానితో సర్దుకున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం పై ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తుంది. మరోసారి టిక్కెట్ ల పెంపు విషయం పై ఆలోచన చెయాలాని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ విషయం పై గురువారం తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దలు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, ఆర్ నారాయణమూర్తి తదితరులు కలిశారు.జగన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యలను వివరించి పరిష్కారం కోరారు. ఇక ఈ మీటింగ్ కి సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు హాజరు కాలేదు. అందులో ముఖ్యంగా సీనియర్ హీరో అక్కినేని నాగర్జున ఆ మీటింగ్ రాలేదు. అన్నీ విషయాల లో ముందు వున్న నాగ్ ఈ విషయంలో ఎందుకు రాలేదు అనే విషయాలు అనేక చర్చలకు దారి తీస్తున్నాయి..
అసలు అతను ఇంత ముఖ్యమైన మీటింగ్ కు రాక పోవడానికి బలమైన కారణం ఉందా? అనే విషయాలు చర్చలకు దారి తీస్తున్నాయి. అయితే నాగ్ ఈ భేటీకి రాకపోవడానికి కారణం అక్కినేని అమల అని తెలుస్తోంది. అమలకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే..నాగ్ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అతనికి కరోనా లేకున్నా కూడా అక్కడకు రావడం వల్ల మరెవ్వరికైనా సమస్యలు వస్తాయని భావించి నాగ్ రాలేదు..అంతేకాకుండా చిరంజీవి అందరి తరుపున మాట్లాడానికి వెళ్లారు అని కూడా చెప్పుకొచ్చారు. అది ఎంత వరకూ నిజమో తెలియాలంటే నాగ్ నోరు విప్పాల్సిందె.. నాగ్ సినిమాల విషయాన్నికొస్తే.. ఇటీవలే బంగర్రాజు సినిమా తో ప్రేక్షకులను అలరించారు.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు..