షాహిద్ కపూర్ ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయం సాధించి ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందిన జెర్సీ సినిమాలు హిందీలో రీమేక్ చేస్తున్నాడు, జెర్సీ హిందీ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఒక టాలీవుడ్ సినిమాను హిందీలో రీమేక్ చేసి మంచి విజయం అందుకున్న షాహిద్ కపూర్ ప్రస్తుతం మరో తెలుగు రీమేక్ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది, నాని హీరోగా తెరకెక్కి టాలీవుడ్బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన శ్యామ్ సింగరాయ్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ఆలోచనలు షాహిద్ కపూర్ సాహిత్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.