ఆ సినిమా హీరో ఒక పెద్ద విలన్ అని మీకు తెలుసా..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో వాన సినిమాతో మ్యూజికల్ హిట్ ఆదుకున్న హీరో వినయ్ రాయ్. ఆయన వాన సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోలు డైరెక్టర్ గా, నిర్మాతలుగా మారుతుంటారు. ఇక తమిళ్ చిత్ర పరిశ్రమలో తమిళ హీరోలు కూడా డైరెక్టుగా తెలుగు సినిమాలతో ఎంట్రీ ఇస్తున్నారు.. ఇక అలా వాన సినిమా ద్వారా తమిళ హీరో వినయ్ రాయ్ కూడా డైరెక్ట్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాకి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డా పాటల పరంగా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తరువాత వినయ్ రాయ్ చాలావరకు తమిళ్ సినిమాలలోనే నటించారు. ఆ తరువాత  ఆయన తమిళ్ సినిమా నీవల్లే నీవల్లే అని తెలుగులో డబ్బింగ్ చేశారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ అందులోని పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఇక వినయ్ రాయ్ నటించిన  ఒక్క సినిమా అయినా పాటలు బాగా హిట్ అవ్వడం వల్ల చాలా మంది ప్రేక్షకులకు గుర్తుండిపోయారనే చెప్పాలి మరి. ఆ తరువాత వినయ్ చిత్ర పరిశ్రమలో ఎక్కడ కనిపించలేదు. ఇక మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఇలా డబ్బింగ్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఆయన హీరోలా కాకుండా  విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోలకు ముచ్చెమటలు పట్టించాడనే చెప్పాలి మరి.

అంతేకాదు.విశాల్ హీరోగా నటించిన డిటెక్టివ్ సినిమాలో వినయ్  విలన్ గా నటించాడు. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయన విలన్ గా నటించిన రెండు సినిమాలు వినయ్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: